RRR Movie: ‘ఆర్‌ఆర్‌ఆర్‌’కి వడ్డీల భారం… నిర్మాత లాభపడాలంటే!

టాలీవుడ్‌లో ఒక పాన్‌ ఇండియా సినిమా వచ్చేసింది. థియేటర్లలో అదృష్టం పరీక్షించుకుంటోంది. ఇప్పుడు రెండో సినిమా రావడానికి అన్నీ ఏర్పాట్లు జరుగుతున్నాయి. అయితే ఈ రోజు వచ్చిన పాన్‌ ఇండియా లెవల్‌ కంటే ఈ సినిమా లెవల్‌ చాలా ఎక్కువ. ఎందుకంటే ఈ సినిమాలో నటించిన నటీనటుల స్థాయి అలాంటిది. అయితే ఇప్పుడు విషయం పాన్‌ ఇండియా మూవీ బడ్జెట్‌ – వసూళ్లు. అవును ఆ సినిమాకు ఎంత ఖర్చయింది, ఎంతొస్తుంది అనేది మొత్తం ఇండస్ట్రీ మూడ్‌ను మార్చేస్తుంది కాబట్టి.

Click Here To Watch Now

మేము పైనంతా చెప్పింది ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ సినిమా గురించే అన్న విషయం మీకు తెలిసిందే. రాజమౌళి దర్శకత్వంలో రామ్‌చరణ్‌, ఎన్టీఆర్‌ నటించిన సినిమా అది. డీవీవీ దానయ్య ఈ సినిమాను నిర్మించారు. వివిధ భాషల్లో వివిధ నిర్మాణ సంస్థలు ఈ సినిమాను విడుదల చేయబోతున్నాయి. ఇప్పటికే రిలీజ్‌ డేట్లు ఇవ్వడం, వివిధ కారణాల వాయిదా పడటం గురించి మనం విన్నాం. దానికి సినిమా నిర్మాణంలో ఆలస్యం, కరోనా తదితర కారణాలు ఉన్నాయి. అయితే ఈ క్రమంలో సినిమా కోసం తీసుకున్న డబ్బుల వడ్డీలు పెరిగాయి. కాబట్టి సినిమా ఖర్చు అనుకున్నదాని కంటే చాలానే అయ్యింది అంటున్నారు.

ఇండస్ట్రీ వర్గాల సమాచారం ప్రకారం చూస్తే… ‘ఆర్‌ఆర్ఆర్‌’కి సుమారు రూ.500 కోట్లు బ‌డ్జెట్ అయ్యింద‌ని అంచ‌నా వేస్తున్నారు. నిజానికి రూ.400 కోట్ల నుండి రూ. 450 కోట్ల‌లోపు సినిమాను ముగించాల‌ని అనుకున్నారట. కానీ విడుద‌ల ఆల‌స్యమయ్యేకొద్దీ వ‌డ్డీలు పెరుగుతూ వచ్చాయి. దీంతో ఇప్పుడు ఈ సినిమా బ‌డ్జెట్ రూ.500 కోట్ల‌ నుండి రూ. 550 కోట్లకు చేరిందంటున్నారు. ఆ లెక్కన సినిమాకు సుమారు రూ. 800 కోట్ల నుండి రూ. 850 కోట్ల వరకు రావాలి అని లెక్కలు వినిపిస్తున్నాయి.

అయితే సినిమాకు ఇప్పటివరకు నాన్‌ థియేట్రికల్‌ రైట్స్‌ రూపంలో రూ.225 కోట్ల నుండి రూ. 250 కోట్ల వరకు వచ్చిందని అంచనా. ఆ లెక్కన సినిమాకు లాభాలు రావాలంటే… థియేట‌ర్ల నుండి రూ. 275 కోట్ల నుండి రూ. 300 కోట్లు రావాలి. ఒకవేళ ఈ లెక్క గ్రాస్ రూపంలో చూడాలంటే క‌నీసం రూ.400 కోట్ల నుండి రూ. 450 కోట్లు వరకు వసూలు చేయాలి. అలా ఎటు చూసినా రూ.800 కోట్ల నుండి రూ. 850 కోట్లు వ‌స్తే త‌ప్ప‌ ‘ఆర్ఆర్ఆర్‌’ నిర్మాతకు లాభాలు వచ్చినట్లు కాదు అంటున్నారు. చూద్దాం మరేమవుతుందో?

రాధే శ్యామ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

ఒకే ఫ్యామిలీలో రెండు జెనెరేషన్స్ కు చెందిన హీరోలతో జోడీ కట్టిన భామల లిస్ట్..!
‘గాడ్ ఫాదర్’ తో పాటు టాలీవుడ్లో రీమేక్ కాబోతున్న 10 మలయాళం సినిమాలు..!
ఈ 10 సినిమాలు తెలుగులోకి డబ్ అయ్యాక కూడా రీమేక్ అయ్యాయని మీకు తెలుసా..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus