చరణ్ పోలీస్ కాదు..ఎన్టీఆర్ బందిపోటూ కాదు..!

  • December 27, 2018 / 07:26 AM IST

దర్శక ధీరుడు రాజ‌మౌళి ప్ర‌స్తుతం రాంచరణ్ – ఎన్టీఆర్ లతో ‘ఆర్.ఆర్.ఆర్’ అనే భారీ మల్టీ స్టారర్ చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్న సంగ‌తి తెలిసిందే. ఇప్పటికే ఈ చిత్రం మొదటి షెడ్యూల్ పూర్తి చేసుకోవడం విశేషం. ఇక ఈ చిత్ర రెండవ షెడ్యూల్ ను 2019 జ‌న‌వ‌రి నుండీ మొదలుపెట్టనున్నారు.’బాహుబలి’ చిత్రంతో జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నాడు రాజమౌళి.. అంతే కాదు తెలుగు చిత్ర స్థాయిని కూడా అమాంతం పెంచేసాడు. ఇప్పుడు మళ్ళీ ‘ఆర్.ఆర్.ఆర్’ లాంటి భారీ ప్రాజెక్ట్ స్టార్ట్ చేయడంతో.. ఈ చిత్రం పై కూడా ఇప్పటికే భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించి ఎటువంటి వార్త బ‌య‌ట‌కి రాకుండా చూసుకుంటున్నాడు రాజమౌళి. అయితే ఫిలింనగర్లో మాత్రం ఈ చిత్రానికి సంబందించి ఏదో ఒక వార్త చక్కర్లు కొడుతూనే ఉంటుంది.

‘ఆర్.ఆర్.ఆర్’ చిత్రాన్ని డీ.వి.వి.ఎంటెర్టైన్మెంట్స్ బ్యానర్ పై డీ.వి.వి.దానయ్య భారీ బ‌డ్జెట్‌తో తెరకెక్కిస్తున్నారు. పిరియాడిక‌ల్ డ్రామాగా ఈ చిత్రాన్ని రాజ‌మౌళి తెర‌కెక్కిస్తున్నట్టు తాజా సమాచారం. స్వాతంత్య్ర పోరాటం నేప‌థ్యంలో రూపొందుతున్న ఈ చిత్రంలో ఎన్టీఆర్ బందిపోటుగా.. రాంచరణ్ పోలీసు అధికారిగా నటిస్తున్నాడని గతంలో వార్తలు వచ్చాయి. అయితే ఇప్పుడు ఇప్పుడు ఈ లైన్ బయటకి వచ్చాక… సోషల్ మీడియాలో డిస్కషన్లు మొదలయ్యాయి.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus