ఆంధ్రప్రదేశ్‌లో సినిమా టికెట్ల ధరల విషయంలో చాలా రోజుల నుండి చర్చ నడుస్తోంది. ఎప్పుడో పదేళ్ల క్రితం నాటి ధరలు పెట్టి ఏపీ ప్రభుత్వం థియేటర్లు, ఎగ్జిబిటర్లు, పంపిణీదారులు తద్వారా నిర్మాతలు… ఆపై ఇండస్ట్రీ నడ్డి విరుస్తోంది. ఈ మాట మేం అనడంలో ఇండస్ట్రీలో పెద్దలు బయటకు అనకపోయినా… లోలోపల అనుకుంటున్నారు. అయితే మీడియా ముందుకొచ్చి మాట్లాడటానికి సిద్ధంగా లేరు. కానీ ఈ రోజు డీవీవీ ఎంటర్‌టైన్మెంట్స్ ఆ పని చేసింది.
ఏపీలో సినిమా పరిశ్రమ సమస్యలపై ఆ మధ్య పవన్ కల్యాణ్ గళమెత్తారు. ఆయనకు ఇండస్ట్రీ నుండి సపోర్టు రాలేదు. ఏపీ ప్రభుత్వ నిర్ణయం వల్ల సినిమాల టికెట్ల ధరలు బాగా తగ్గిపోయాయి. ఆ ధరలతో సినిమాలు ఆడిస్తే థియేటర్లు మూసుకోవడమే అని కొంతమంది థియేటర్ల యజమానులూ అన్నారు. ఇప్పుడు ‘ఆర్ఆర్‌ఆర్’ టీమ్ కూడా అదే పని చేసింది. ‘‘ఏపీలో సినిమా టిక్కెట్ ధరలు తగ్గించడం మా సినిమాపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది’’ అని ట్వీట్ చేసింది.
అయితే, ఈ విషయంపై తాము న్యాయం కోరుతూ న్యాయస్థానాన్ని ఆశ్రయించే ఆలోచన లేదు అని ఆర్‌ఆర్‌ఆర్ టీమ్ చెప్పింది. ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని కలిసి మా పరిస్థితి తెలియజేసి… పరిష్కారం కోరుతాం అని ఆ ట్వీట్‌లో ‘ఆర్‌ఆర్‌ఆర్’ నిర్మాణ సంస్థ డీవీవీ ఎంటర్‌టైన్మెంట్స్ ఆ ట్వీట్‌లో పేర్కొంది. ఇప్పుడు మరి టాలీవుడ్ నుండి ఎలాంటి స్పందన వస్తుందో చూడాలి.
Most Recommended Video
ప్రకటనలతోనే ఆగిపోయిన మహేష్ బాబు సినిమాలు ఇవే..!
రాజా విక్రమార్క సినిమా రివ్యూ & రేటింగ్!
3 రోజెస్ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!