Rudhrudu Collections: రెండో రోజు ‘శాకుంతలం’ కంటే ఎక్కువ కలెక్ట్ చేసిన ‘రుద్రుడు’.. కానీ ..?

స్టార్ కొరియోగ్రాఫర్, టాప్ డైరెక్టర్ అయిన రాఘవ లారెన్స్ హీరోగా కతిరేసన్ దర్శకత్వంలో రూపొందిన యాక్షన్ ఎంటర్ టైనర్ ‘రుద్రుడు. తెలుగు, తమిళ భాషల్లో ఈ మూవీ ఏప్రిల్ 14న గ్రాండ్ గా విడుదల అయ్యింది. లారెన్స్ సరసన ప్రియా భవానీ శంకర్ హీరోయిన్ గా నటించగా, శరత్ కుమార్ కీలక పాత్రలో కనిపించనున్నారు. ‘ఫైవ్ స్టార్ క్రియేషన్స్ ఎల్ ‌ఎల్‌ పి’ బ్యానర్ పై కతిరేశన్ సమర్పణలో ‘పిక్సెల్ స్టూడియోస్‌ ప్రొడ్యూసర్’ ఠాగూర్ మధు ఈ సినిమాని తెలుగు రాష్ట్రాల్లో విడుదల చేశారు.

మొదటి రోజు ఈ చిత్రానికి మిక్స్డ్ టాక్ నమోదైంది. ఫస్ట్ హాఫ్ చాలా వరస్ట్ గా ఉందని… సెకండ్ హాఫ్ పర్వాలేదు అని ప్రేక్షకులు చెప్పుకొచ్చారు. అయినప్పటికీ మొదటి రోజు ఈ చిత్రానికి మంచి కలెక్షన్స్ నమోదయ్యాయి. రెండో రోజు మాత్రం డ్రాప్ అయ్యింది. ఒకసారి 2 డేస్ కలెక్షన్స్ ను గమనిస్తే :

నైజాం 0.40 cr
సీడెడ్ 0.24 cr
ఉత్తరాంధ్ర 0.19 cr
ఈస్ట్ 0.14 cr
వెస్ట్ 0.07 cr
గుంటూరు 0.10 cr
కృష్ణా 0.09 cr
నెల్లూరు 0.06 cr
ఏపీ + తెలంగాణ (టోటల్) 1.29 cr

‘రుద్రుడు’ చిత్రానికి తెలుగు రాష్ట్రాల్లో రూ.6.55 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ మూవీ బ్రేక్ ఈవెన్ కావాలంటే రూ.6.8 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది. రెండు రోజులు పూర్తయ్యేసరికి ఈ మూవీ రూ.1.29 కోట్ల షేర్ ను రాబట్టింది. ఇవి డీసెంట్ షేర్స్ కానీ..

టాక్ నెగిటివ్ గా ఉండటం వల్ల రెండో రోజు కలెక్షన్స్ డౌన్ అయ్యాయి. అయితే ఈ మూవీ సమంత నటించిన ‘శాకుంతలం’ కంటే బెటర్ గా పెర్ఫార్మ్ చేసిందని చెప్పాలి. ముఖ్యంగా మాస్ సెంటర్స్ లో డీసెంట్ అనిపించింది.

శాకుంతలం సినిమా రివ్యూ & రేటింగ్!
అసలు పేరు కాదు పెట్టిన పేరుతో ఫేమస్ అయినా 14 మంది స్టార్లు.!

బ్యాక్ టు బ్యాక్ ఎక్కువ ప్లాపులు ఉన్న తెలుగు హీరోలు ఎవరంటే?
పూజా హెగ్డే కంటే ముందు సల్మాన్ ఖాన్ తో డేటింగ్ చేసిన 13 మంది హీరోయిన్లు!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus