Rudrangi: సెన్సార్ వాళ్లకే షాకిచ్చిన ‘రుద్రంగి’ సినిమా..!

‘లెజెండ్’ తో సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసి సక్సెస్ ఫుల్ గా దూసుకుపోతున్న జగపతి బాబు ‘రుద్రంగి’ అనే సినిమాలో ప్రధాన పాత్రని పోషించారు. ‘బాహుబలి'(సిరీస్) కి రైటర్ గా పనిచేసిన అజయ్ సామ్రాట్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. టీజర్, ట్రైలర్ లు కొత్తగా ఉన్నాయి. దీంతో ‘రుద్రంగి’ పై అంచనాలు ఏర్పడ్డాయి. మమత మోహన్ దాస్,విమలా రామన్ లు ఈ చిత్రంలో హీరోయిన్లుగా నటిస్తున్నారు. జులై 7న ఈ చిత్రం థియేటర్లలో రిలీజ్ కాబోతోంది.

ఆల్రెడీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించారు. నందమూరి బాలకృష్ణ ఈ వేడుకకి గెస్ట్ గా వచ్చి టీంకి బెస్ట్ విషెస్ చెప్పారు. ఇక రిలీజ్ డేట్ దగ్గర పడుతుండటంతో సెన్సార్ ఫార్మాలిటీస్ కూడా కంప్లీట్ చేసుకుంది చిత్ర బృందం. ఈ చిత్రానికి ఏకంగా 32 కట్స్ తో యు/ఎ సర్టిఫికెట్ ను జారీ చేసింది సెన్సార్ బృందం. ఆ 32 కట్స్ కూడా ఘోరమైన బూతులు, వయొలెన్స్ తో కూడుకున్న సన్నివేశాలు అని తెలుస్తుంది.

‘లం** కొడ*’ ‘లం* ముం*’ ‘లంమి* కొడ*’ ‘లం*కె*’ ‘బా*ర్డ్’ ‘బోస్* కె’ ‘బెహెన్ చ*’ వంటి బూతుల వల్ల ఈ చిత్రానికి చాలా కట్స్ పడినట్లు తెలుస్తుంది. అలాగే జగపతి బాబు హెడ్ కట్ అయినట్టు ఉన్న సన్నివేశాన్ని కూడా వేరే షాట్స్ తో మేనేజ్ చేసినట్టు సమాచారం. సెన్సార్ వారు ఇన్ని సీన్లు కట్ చేయడం అనేది ఈ మధ్య కాలంలో (Rudrangi) ‘రుద్రంగి’ సినిమా విషయంలోనే జరిగిందట.

స్పై సినిమా రివ్యూ & రేటింగ్!

సామజవరగమన సినిమా రివ్యూ & రేటింగ్!
వివాదాలకు కేరాఫ్ అడ్రస్ మారిన విజయ్ దళిపతి సినిమాలు!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus