జగపతిబాబు ప్రధాన పాత్రలో తెరకెక్కిన లేటెస్ట్ మూవీ ‘రుద్రంగి’. నాగార్జున నటించిన ‘రాజన్న’, ప్రభాస్- రాజమౌళి కాంబినేషన్లో వచ్చిన ‘బాహుబలి'(సిరీస్) కి డైలాగ్స్ రాసిన అజయ్ సామ్రాట్ ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. ‘రసమయి ఫిలిమ్స్’ బ్యానర్ పై ఎమ్మెల్యే డాక్టర్ రసమయి బాలకిషన్ ఈ చిత్రాన్ని నిర్మించారు. మమత మోహన్ దాస్, విమల రామన్‌లు వంటి సీనియర్ హీరోయిన్లు ఈ సినిమాతో రీ ఎంట్రీ ఇస్తున్నారు. టీజర్, ట్రైలర్స్ లో జగపతి బాబు నటన ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తుండటంతో జనాల ఫోకస్ ఈ చిత్రం పై పడింది.
జులై 7న.. అంటే మరికొన్ని గంటల్లో థియేటర్లలో రిలీజ్ కాబోతోంది (Rudrangi )ఈ చిత్రం. ఆల్రెడీ కొన్ని చోట్ల షోలు పడ్డాయి. సినిమా చూసిన వారు ట్విట్టర్ ద్వారా తమ అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు. సినిమా ఫస్ట్ హాఫ్ బాగుంది అని. సెకండాఫ్ లో ఎమోషనల్ సన్నివేశాలు కొంత బోర్ ఫీలింగ్ ను కలిగిస్తాయని. అయితే జగపతి బాబు, మమతా మోహన్ దాస్ ల నటన హైలెట్ గా నిలిచిందని అంటున్నారు. ఒకప్పుడు తెలంగాణాలో దొరలు..
సామాన్యులను ఎలా చిత్ర హింసలు పెట్టేవారో .. ఆనాటి రోజులు ఎలా ఉండేవో ఈ సినిమా ద్వారా దర్శకుడు అజయ్ సామ్రాట్ మరోసారి చాలా నాచురల్ గా గుర్తు చేసినట్లు వారు చెబుతున్నారు.మొత్తంగా యావరేజ్ గా ఉందని అంటున్నారు. మరి ఇక్కడ మార్నింగ్ షోలు ముగిశాక ఎలాంటి టాక్ వస్తుందో చూడాలి.
You can definitely say that this movie came out as a surprise this weekend. Clearly showcases the Oppression that existed in Telangana even after independence and the fight back of People. The sentiments worked out well. pic.twitter.com/XWEiUnh1Av