హిస్టారికల్ గా రుద్రంగి టీజర్, మే 26 న గ్రాండ్ రిలీజ్.

జగపతి బాబు, ఆశిష్ గాంధీ, మమతా మోహన్ దాస్, విమల రామన్ ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా రుద్రంగి. ఎమ్మెల్యే డాక్టర్ రసమయి బాలకిషన్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోన్న చిత్రం ఇది. బాహుబలి, ఆర్.ఆర్.ఆర్ చిత్రాలకు రైటర్ గా పని చేసిన అజయ్ సామ్రాట్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే అన్ని పాత్రల ఫస్ట్ లుక్ పోస్టర్స్ తో ఆసక్తిని పెంచిన ఈ మూవీ టీజర్ విడుదలైంది.

రుద్రంగి టీజర్ చాల ఆసక్తిగా ఉంది. స్వతంత్రం తర్వాత ఆనాటి తెలంగాణ సాంఘిక పరిస్థితుల నేపథ్యం లో ఈ చిత్రం కనిపిస్తోంది. జగపతి బాబు భీం రావు దేశ్ ముఖ్ అనే క్రూరమైన దొర పాత్రలో కనిపిస్తున్నాడు. స్వాతంత్రం మాకే కానీ బానిసలకు కాదు, వాడు బలవంతుడి కావొచ్చు కానీ నేను భగవంతుడిని అనే మాటల ద్వారా జగపతి బాబు పాత్ర ఎంత క్రూరంగా ఉంటుంది, నాటి తెలంగాణాలో దొరల ఆగడాలు ఎలా ఉన్నాయి అనేది కళ్ళకు కట్టినట్టు చూపించబోతున్నారు అని తెలుస్తోంది. అలాంటి దొరకు మల్లేష్ అనే కుర్రాడు ఎదురు తిరిగితే అతన్ని ఏం చేశారు అనే కోణంతో పటు అనేక వాస్తవ ఘటనలను తెరకెక్కించినట్టు ఈ టీజర్ చూస్తే అర్థమవుతోంది. టీజర్ ఆసాంతం చాల ఇంట్రెస్టింగ్ గా ఉంది. ఇక ప్రతి పాత్రకు ఒక ఐడెంటిటీ కనిపిస్తోంది. ముఖ్యంగా జగపతి బాబు పాత్ర ఇప్పటివరకు ఆయన కెరీర్ చేయనిదిగా ఉంది. ఆయన ఆహార్యం, వాచకం తోనే క్రూరత్వం కనిపిస్తోంది. ఇక జ్వాలాబాయి దేశ్ ముఖ్ గా మమతా మోహన్ దాస్ కూడా జగపతి పాత్రకు తీసినిపోని విధంగా అహంకారంతో కనిపిస్తోంది. మల్లేష్ గా ఆశిష్ గాంధీకి మంచి పాత్ర వచ్చినట్టుగా ఉంది.

టేకింగ్, మేకింగ్ పరంగా చాల క్వాలిటీతో ఉంటుంది మూవీ అని అర్థం అవుతోంది. ఆనాటి కాలాన్ని ప్రతిబింబిచేలా ఆర్ట్ వర్క్ ఉంది.రసమయి ఫిలిమ్స్ బ్యానర్ నుంచి భారీ నిర్మాణ హంగులతో తెరకెక్కిస్తున్న ‘రుద్రంగి’ మే నెల 26న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus