Nani Premkumar: నాని చెప్పిన ఆ ఎమోషనల్‌ లవ్‌ స్టోరీలో ఎన్టీఆర్‌ హీరోయిన్‌ నటిస్తోందా?

రీసెంట్‌గా ‘ది ప్యారడైజ్‌’ సినిమాతో వచ్చి ప్రేక్షకుల మెప్పు పొందలేకపోయారు కథానాయకుడు నాని. ఆ సినిమా మీద ఆయన పెట్టుకున్న నమ్మకానికి.. ఆ సినిమాకు వచ్చిన ఫలితానికి ఎక్కడా సంబంధం లేదు. దీంతో తన సినిమా కథల ఎంపిక విషయంలో నాని పూర్తిగా మార్పులు చేసుకుంటున్నాడు అని ఆ మధ్య వార్తలొచ్చాయి. ఇటీవల ఓ నాన్‌ తెలుగు రిపోర్టర్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో కూడా నాని ఇదే మాట చెప్పాడు. తన తర్వాతి సినిమాల్లో ఓ ఎమోషనల్‌ లవ్‌ స్టోరీ ఉందని చెప్పాడు.

Rukmini Vasanth

నాని అలా చెప్పాడని.. ఆయన నెక్స్ట్‌ సినిమా ‘బ్లడీ రోమియో’ను ఎమోషనల్‌ లవ్‌స్టోరీ అనుకునేరు. ఆయన చెప్పింది మరో సినిమా గురించి. ఆ ప్రాజెక్ట్‌ గురించే ఇప్పుడు చర్చ జరుగుతోంది. ఓ తమిళ సీనియర్‌ దర్శకుడు ఇటీవల నానికి ఓ కథ చెప్పారట. ప్రేమకథ, కుటుంబ నేపథ్యం మీద సినిమాలు తీసే ఆ దర్శకుడే ప్రేమ్‌ కుమార్‌. ‘96’, ‘మెయ్యిళగన్‌’/ ‘సత్యం సుందరం’ సినిమాల దర్శకుడే ఈ ప్రేమ్‌ కుమార్‌. ఆయనే నానికి ఓ కథ లైన్‌ చెప్పి ఓకే చేసుకున్నారట.

నాని – ప్రేమ్‌ కుమార్‌ మధ్య గత కొన్ని నెలలుగా జరుగుతున్న చర్చలు కొలిక్కి వచ్చాయట. ఈ క్రమంలో ఈ సినిమాలో నటించబోయే హీరోయిన్ గురించి కూడా డిస్కషన్ జరుగుతోందట. ఏషియన్ సినిమాస్‌ బ్యానర్‌ మీద సునీల్ నిర్మించనున్న ఈ సినిమాలో కన్నడ భామ రుక్మిణి వసంత్ హీరోయిన్‌గా నటిస్తోందని సమాచారం. ఈ ఏడాది ఆఖరులో కానీ, వచ్చే ఏడాది ప్రథమార్ధంలోనే కానీ ఈ సినిమాను పట్టాలెక్కిస్తారట.

ప్రేమ్ కుమార్ సినిమాల్లో కథానాయిక పాత్రలకు ప్రాముఖ్యత ఉంటుంది. ’96’లో విజయ్ సేతుపతి కంటే త్రిషకే ఎక్కువ పేరు వచ్చిందంటే అతిశయోక్తి కాదు. ఇక ‘సత్యం సుందరం’ సినిమాలో అరవింద్ స్వామి, కార్తీల స్క్రీన్‌ స్పేస్‌ ఎక్కువ ఉన్నా.. బలమైన మహిళా పాత్రలు కూడా ఉంటాయి. సినిమాలో కీలక సమయాల్లో ఆ పాత్రలు వచ్చి.. ఎమోషన్‌ని పండించాయి. ఇప్పుడు నాని సినిమా కోసం కూడా అలాంటి బలమైన హీరోయిన్‌ పాత్రనే రాసుకున్నారట.

‘డర్టీ 2’: ఎవరి కథ తీస్తున్నారు? ఎవరు యాక్ట్‌ చేస్తున్నారు?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus