తెలుగు సినిమాల్లో ప్రస్తుతం కొత్త తరం హీరోయిన్లలో చాలా ఎక్కువగా వినిపిస్తున్న పేరు రుక్మిణి వసంత్. కన్నడ ఇండస్ట్రీ నుంచి వచ్చినప్పటికీ, తెలుగులో విడుదలైన చిత్రాలతో చాలా తక్కువ సమయంలోనే ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించింది ఈ భామ. ‘సప్త సాగరాలు దాటి’ సినిమాతో టాలీవుడ్‌లో అడుగుపెట్టిన రుక్మిణి, తొలి సినిమాతోనే మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత పాన్ ఇండియా స్థాయిలో విడుదలైన ‘కాంతారా చాప్టర్ 1’ లో కీలక పాత్ర ఆమె కెరీర్‌ను మరో స్థాయికి తీసుకెళ్లిందని చెప్పాలి.
ఇలా కెరీర్ పరంగా దూసుకుపోతున్న ఈ కాంతారా బ్యూటీ వ్యక్తిగత జీవితం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. ఇటీవల రుక్మిణి ఒక యువకుడితో ఎంతో చనువుగా ఉన్న ఫోటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ కావడంతో, “రుక్మిణి సింగిల్ కాదా?” అనే ప్రశ్నలు మొదలయ్యాయి. ఆ ఫోటోలో ఆమెతో కనిపిస్తున్న వ్యక్తి ఎవరు అనే ఆసక్తి అభిమానుల్లో పెరిగింది. సోషల్ మీడియాలో అందుతున్న సమాచారం ప్రకారం అతని పేరు సిద్దార్థ్ నాగ్ అని తెలుస్తోంది. అయితే వీరిద్దరి మధ్య నిజంగా రిలేషన్ ఉందా? లేక ఇది కేవలం స్నేహం మాత్రమేనా? అన్నదానిపై ఇప్పటివరకు ఎలాంటి అధికారిక స్పష్టత లేదు.

ఈ వార్తలు బయటకు రావడంతో కొందరు అభిమానులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తుండగా, మరికొందరు “ఇది ఆమె వ్యక్తిగత విషయం” అంటూ సపోర్ట్ చేస్తున్నారు. ఇక సినిమాల విషయానికి వస్తే, రుక్మిణి ప్రస్తుతం టాలీవుడ్‌లో భారీ ప్రాజెక్ట్స్‌తో బిజీగా ఉంది. NTR సరసన ‘డ్రాగన్’ సినిమాలో నటిస్తోంది. అలాగే KGF యష్ హీరోగా ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న ‘టాక్సిక్’ చిత్రంలోనూ కీలక పాత్రలో కనిపించబోతోంది.
ఇలా ఒకవైపు కెరీర్ పీక్స్‌లో ఉండగా, మరోవైపు వ్యక్తిగత జీవితంపై వస్తున్న వార్తలతో రుక్మిణి వసంత్ మరోసారి వార్తల్లో నిలిచింది. మరి ఈ ఫోటోల వెనుక నిజం ఏంటన్నది తెలియాలంటే… ఆమె స్పందన కోసం వేచి చూడాల్సిందే.
