చిన్న వయసులోనే నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్న టాలెంటెడ్ & అందాల నటి సారా అర్జున్. బాలీవుడ్ లో రణవీర్ సింగ్ హీరోగా తెరకెక్కిన ‘ధురంధర్’ మూవీ విడుదలై బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన సంగతి అందరికి తెలిసిందే. ఆ మూవీ లో హీరోయిన్ గా ఛాన్స్ కొట్టేసి తన మార్క్ నటన & అందంతో యువతలో ఒక్క సినిమాతోనే విపరీతమైన క్రేజ్ సంపాదించుకున్న బ్యూటీ సారా అర్జున్.ఇప్పుడు టాలీవుడ్‌లో కూడా మరింత బిజీ అవుతోంది. ఇటీవల ఓ పబ్లిక్ ఈవెంట్‌లో సారా చక్కగా తెలుగులో మాట్లాడుతూ అందరి మనసులు గెలుచుకుంది. ఈ సందర్భంగా ఆమెను “టాలీవుడ్‌లో మీకు ఫేవరెట్ హీరో ఎవరు?” అని అడగ్గా, ఎలాంటి సందేహం లేకుండా తనకు విజయ్ దేవరకొండ అంటే చాలా ఇష్టమని చెప్పింది.
సారా నోట ఈ మాట రావడంతో రౌడీ హీరో అభిమానులు సోషల్ మీడియాలో హర్షం వ్యక్తం చేస్తున్నారు. విజయ్ దేవరకొండ స్టైల్, యాటిట్యూడ్, సినిమాల ఎంపిక తనకు బాగా నచ్చుతాయని సారా చెప్పడం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. ఇక సినిమాల విషయానికి వస్తే… తెలుగులో తాను రెండు క్రేజీ ప్రాజెక్ట్స్ చేయబోతున్నట్టు సారా ఈ సందర్భంగా వెల్లడించింది. ఒకటి స్టార్ డైరెక్టర్ గుణశేఖర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘యుఫోరియా’. ఈ మూవీ ఫిబ్రవరి 6న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. దీనికి సంబందించిన ట్రైలర్ రిలీజ్ చేసారు చిత్ర యూనిట్. మరోవైపు న్యాచురల్ స్టోరీటెల్లింగ్‌కు పేరుగాంచిన దర్శకుడు గౌతమ్ తిన్ననూరి డైరెక్షన్‌లో రాబోతున్న ‘మ్యాజిక్’ సినిమాలో కూడా ఆమె కీలక పాత్రలో నటిస్తోంది.

ఇలా ఫేవరెట్ హీరో మాటలతో పాటు వరుస సినిమాల అప్డేట్స్‌తో సారా అర్జున్ టాలీవుడ్‌లో తనదైన ముద్ర వేసేందుకు రెడీ అవుతోంది. ఇక రాబోయే రోజుల్లో ఆమె నుంచి ఎలాంటి సర్ప్రైజ్‌లు ఉంటాయో చూడాలి!
