Rules Ranjann First Review: ‘రూల్స్ రంజన్’ ఫస్ట్ రివ్యూ వచ్చేసింది… ఎలా ఉందంటే?

ఈ వారం దాదాపు అరడజను సినిమాలు ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి. ఇందులో కిరణ్ అబ్బవరం హీరోగా తెరకెక్కిన ‘రూల్స్ రంజన్’ ఒకటి. అంతేకాదు ఈ వీకెండ్ కి ప్రేక్షకుల ఫస్ట్ ఛాయిస్ గా ఈ సినిమానే ఉంది. కిరణ్ అబ్బవరం క్లాస్ అండ్ కామెడీ ఇమేజ్ కలిగిన హీరో. ‘రూల్స్ రంజన్’ టీజర్, ట్రైలర్స్ చూస్తుంటే.. సినిమా కూడా ఆ కోవకు చెందిందే అని అందరికీ ఓ క్లారిటీ వచ్చేసింది. ఏ.ఎం.రత్నం తనయుడు రత్నం కృష్ణ కొంత గ్యాప్ తర్వాత డైరెక్ట్ చేసిన సినిమా ఇది.

ఆయన కూడా సమర్పకులుగా వ్యవహరిస్తున్నారు. ఇక ‘రూల్స్ రంజన్’ పై చిత్ర బృందం చాలా కాన్ఫిడెంట్ గా ఉంది. ‘సమ్మోహనుడా’ అనే పాట యూట్యూబ్ లో మిలియన్ల వ్యూస్ ని కొల్లగొట్టింది. ‘డీజే టిల్లు’ బ్యూటీ నేహాశెట్టి ఇందులో హీరోయిన్ కావడం ప్రేక్షకులను ఆకర్షించే విషయాల్లో ఒకటిగా చెప్పుకోవచ్చు. ఇక ఇండస్ట్రీకి చెందిన కొంతమంది ప్రముఖులకు ‘రూల్స్ రంజన్’ స్పెషల్ షో వేయడం జరిగింది. సినిమా చూసిన ప్రేక్షకులంతా .. పాజిటివ్ రెస్పాన్స్ ఇచ్చారు.

కామెడీ హిలేరియస్ గా వర్క్ అవుట్ అయ్యిందని,వెన్నెల కిషోర్ ట్రాక్ హైలెట్ అని, కథని మలుపు తిప్పే పాత్రగా కూడా వెన్నెల కిషోర్ కి మంచి మార్కులు పడ్డాయని సినిమా చూసిన వారు చెబుతున్నారు. డౌట్ లేకుండా ఈ వీకెండ్ కి బాక్సాఫీస్ వద్ద సందడి చేసే సినిమా ఇదే అవుతుందని అంటున్నారు.

మరోపక్క ఈ చిత్రానికి (Rules Ranjann) బిజినెస్ కూడా బాగా జరుగుతుంది. ఆహా ఓటీటీ సంస్థ నుండి ఈ చిత్రానికి ఫ్యాన్సీ రేటు లభించిందని తెలుస్తుంది. అయితే మేకర్స్ ఇంకా డీల్ ని ఫైనల్ చేయలేదు, రిలీజ్ తర్వాత ఇంకా మంచి ఆఫర్లు వస్తాయని వారు భావిస్తున్నారు. మరి అక్టోబర్ 6 న మార్నింగ్ షోలు ముగిశాక ‘రూల్స్ రంజన్’ కి ప్రేక్షకుల నుండి ఎలాంటి టాక్ వస్తుంది అనేది చూడాలి.

స్కంద సినిమా రివ్యూ & రేటింగ్!

చంద్రముఖి 2 సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ ప్రిన్స్ యవార్ గురించి 10 ఆసక్తికర విషయాలు !

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus