Rakul Preet: కియారా అయిపోయిందిగా.. ఇప్పుడు రకుల్‌ వంతు వచ్చిందా?

  • February 14, 2023 / 02:37 PM IST

వరుస సినిమాలు చేస్తున్నప్పుడే పెళ్లి చేసుకుని కాస్త గ్యాప్‌ తీసుకొని మళ్లీ సినిమాల్లోకి రావడం బాలీవుడ్‌ భామలకు అలవాటు. గత కొన్నేళ్లుగా ఆ భామలు ఈ పనే చేస్తున్నారు. అక్కడి అభిమానులు ఆదరిస్తున్నారు కూడా. ఇప్పటి తరం భామలు కూడా అదే పని చేస్తున్నారు. ఇటీవల ఈ కోవలోకి కియారా అడ్వాణీ కూడా వచ్చి చేరింది. ఆమె పెళ్లి అంటూ చాలా రోజులు పుకార్లు వచ్చి.. ఇప్పుడు పెళ్లి పూర్తయిపోయింది. దీంతో ఇప్పుడు బాలీవుడ్‌ మీడియా, నెటిజన్ల చూపు రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ మీదకు వచ్చింది.

సౌత్‌లో విజయవంతమైన నాయికగా పేరు తెచ్చుకుని బాలీవుడ్‌కి వెళ్లిపోయింది రకుల్‌ ప్రీత్‌ సింగ్‌. అక్కడ వరుసగా అవకాశాలు సంపాదించినా సరైన విజయం అందుకోలేకపోయింది. దీంతో సగటు సౌత్‌ హిట్‌ నాయికలా మిగిలిపోయింది. అంటే వీళ్లకు సౌత్‌లో తప్ప నార్త్ లో హిట్లు ఉండవు అని తేలిపోయింది అనే రకం. ఆ విషయం పక్కపెడితే.. ఆమె అక్కడ హిట్‌ సినిమా పట్టుకోలేకపోయినా.. లవ్‌లో మాత్రం హిట్‌ కొట్టింది. ప్రముఖ నిర్మాత, నటుడు అయిన జాకీ భగ్నానీతో ప్రేమలో పడింది.

ఎవరికీ ఎలాంటి లీక్‌లు, డౌట్‌లు లేకుండా సాగుతున్న వాళ్ల ప్రేమయాణాన్ని రకులే కొన్ని రోజుల క్రితం అనౌన్స్‌ చేసింది. దీంతో పెళ్లి.. పెళ్లి.. అంటూ నెటిజన్లు గోల పెట్టారు. దీనిపై వరుసగా క్లారిటీలు ఇచ్చుకుంటూ వచ్చిన రకుల్‌ ఒకానొక సమయంలో చిరాకు వచ్చి నేనే చెబుతా పెళ్లి ముచ్చట్లు… మీరు ఏదో ఒకటి అనుకోవద్దు అని చెప్పింది. అయితే ఇలా కియారా పెళ్లి అయ్యిందో లేదో మళ్లీ రకుల్‌ పెళ్లి ముచ్చట్లు మొదలుపెట్టేశారు.

దీంతో రకుల్‌ ఫ్యాన్స్‌ అయితే ఆమె చెబుతాను అంది కదా.. ఆగండి. ఇది టూ మచ్‌ అంటూ కామెంట్స్‌ చేస్తున్నారు. రకుల్‌ ఇటీవల ‘ఛత్రీవాలీ’ అనే సినిమాతో వచ్చి విజయం అందుకోలేకపోయింది. ఇప్పుడు ఆమె చేతిలో ‘మేరీ పత్నీ కా రీమేక్‌’, ‘ఆయాలన్‌’, ‘ఇండియన్‌ 2’, ‘31 అక్టోబర్‌ లేడీస్‌ నైట్‌’ అనే సినిమాలు చేస్తోంది.

అమిగోస్ సినిమా రివ్యూ & రేటింగ్!
పాప్ కార్న్ సినిమా రివ్యూ & రేటింగ్!

వేద సినిమా రివ్యూ & రేటింగ్!
యూ.ఎస్ లో టాప్ గ్రాసర్స్ గా నిలిచిన 10 టాలీవుడ్ సినిమాలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus