Akhanda Sequel: అఖండ సీక్వెల్ గురించి షాకింగ్ వార్తలు.. ఫ్యాన్స్ అంగీకరిస్తారా?

బాలయ్య (Balakrishna) బోయపాటి శ్రీను (Boyapati Srinu)  కాంబినేషన్ లో తెరకెక్కిన అఖండ (Akhanda)  మూవీ సంచలన విజయం సాధించడంలో థమన్ పాత్ర ఎంతో ఉంది. థమన్ (S.S.Thaman)  ఈ సినిమాకు ఇచ్చిన మ్యూజిక్, బీజీఎం ఈ సినిమా సక్సెస్ లో కీలక పాత్ర పోషించాయి. గత కొన్నేళ్లుగా బాలయ్య సినిమాలకు వరుసగా థమన్ మ్యూజిక్ డైరెక్టర్ గా పని చేస్తున్నారు. గతంలో థమన్ అఖండ సీక్వెల్ కు సంబంధించి కొన్ని అప్ డేట్స్ సైతం ఇవ్వడం జరిగింది.

14 రీల్స్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై అఖండ సీక్వెల్ తెరకెక్కనుండగా ఈ సినిమాకు హర్షవర్ధన్ రామేశ్వర్ (Harshavardhan Rameshwar) మ్యూజిక్ డైరెక్టర్ అని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది. యానిమల్ (Animal) సినిమాతో మ్యూజిక్ డైరెక్టర్ గా మంచి పేరు సొంతం చేసుకున్న హర్షవర్ధన్ రామేశ్వర్ కు ఎంతోమంది ఫ్యాన్స్ ఉన్నారు. అయితే అఖండ సీక్వెల్ కు మాత్రం థమన్ కే ఛాన్స్ ఇస్తే బాగుంటుందని కామెంట్లు వినిపిస్తున్నాయి.

థమన్ అఖండ సీక్వెల్ కోసం పని చేస్తున్నారో లేదో అధికారికంగా క్లారిటీ రావాల్సి ఉంది. థమన్ ఎన్ని సినిమాలతో బిజీగా ఉన్నా అఖండ సీక్వెల్ కు నో చెప్పే అవకాశం అయితే ఉండదని చెప్పవచ్చు. వైరల్ అవుతున్న వార్తలను ఇప్పటికి రూమర్లుగానే పరిగణించాల్సి ఉంటుంది. అఖండ సీక్వెల్ 100 కోట్ల రూపాయల కంటే ఎక్కువ మొత్తం బడ్జెట్ తో తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే.

స్కంద (Skanda) సినిమా ఆశించిన ఫలితాన్ని అందుకోకపోవడంతో బోయపాటి శ్రీను అఖండ2 సినిమాకు సంబంధించి ఎన్నో జాగ్రత్తలు తీసుకున్నారని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది. అఖండ2 సినిమా షూటింగ్ లో బాలయ్య ఎప్పటినుంచి పాల్గొంటారనే ప్రశ్నకు సంబంధించి సమాధానం దొరకాల్సి ఉంది. బాలయ్య బాబీ (Bobby)  కాంబో మూవీ వచ్చే ఏడాదికి వాయిదా పడిందని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సినిమా రిలీజ్ డేట్ కు సంబంధించి వేర్వేరు వార్తలు ప్రచారంలోకి వస్తున్నాయి.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus