అమలా పాల్ కామెంట్ల వెనుక అర్థం ఇదేనా!

  • July 8, 2022 / 05:32 PM IST

ప్రముఖ టాలీవుడ్ హీరోయిన్లలో ఒకరైన అమలా పాల్ కు నాయక్, ఇద్దరమ్మాయిలతో సినిమాల ద్వారా తెలుగులో మంచి గుర్తింపు దక్కింది. ఈ సినిమాలలో నాయక్ సక్సెస్ సాధిస్తే ఇద్దరమ్మాయిలతో సినిమా ఫ్లాప్ రిజల్ట్ ను అందుకుంది. ప్రముఖ దర్శకుడు ఏఎల్ విజయ్ ను అమలా పాల్ పెళ్లి చేసుకోగా కొన్ని కారణాల వల్ల వీళ్లిద్దరూ విడిపోయారనే సంగతి తెలిసిందే. మలయాళ సినిమాల ద్వారా కెరీర్ ను మొదలుపెట్టిన అమలా పాల్ కెరీర్ తొలినాళ్లలో బోల్డ్ రోల్స్ లో కూడా నటించారు.

నాగచైతన్య హీరోగా తెరకెక్కిన బెజవాడ సినిమాతో తెలుగులో నటిగా అమలా పాల్ కెరీర్ మొదలైంది. అయితే పెళ్లైన మూడు సంవత్సరాలకే అమలాపాల్ భర్తతో విడిపోయారు. విజయ్ తో అమలా పాల్ విడిపోవటానికి గల కారణాలు వెలుగులోకి రాలేదు. అయితే భర్తతో అమలా పాల్ విడిపోయిన తర్వాత ఆమె రెండో పెళ్లికి సంబంధించి వేర్వేరు వార్తలు ప్రచారంలోకి వస్తున్నాయి. తాజాగా ఒక నెటిజన్ అమలా పాల్ ను పెళ్లి గురించి ప్రశ్నించారు.

మిమ్మల్ని పెళ్లి చేసుకోవాలంటే ఎలాంటి అర్హతలు ఉండాలని అమలా పాల్ ను ప్రశ్నించగా ఆ ప్రశ్న గురించి అమలా పాల్ స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం నాకు మళ్లీ పెళ్లి చేసుకునే ఆలోచన అయితే లేదని ఆమె అన్నారు. నన్ను ఉన్నతంగా మార్చుకునే పనిలో నేను బిజీగా ఉన్నానని ఆమె తెలిపారు.అందువల్ల ప్రస్తుతం నేను పెళ్లి చేసుకోబోయే వ్యక్తికి కావాల్సిన లక్షణాల గురించి చెప్పడం సాధ్యం కాదని ఆమె అన్నారు.

నన్ను పెళ్లి చేసుకోవాలంటే ఎలాంటి లక్షణాలు ఉండాలో త్వరలో వెల్లడిస్తానని ఆమె చెప్పుకొచ్చారు. అమలా పాల్ చేసిన కామెంట్లు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ప్రస్తుతం సినిమాలు, వెబ్ సిరీస్ లతో అమలా పాల్ బిజీగా ఉన్నారు. అమలా పాల్ తర్వాత ప్రాజెక్ట్ లతో కూడా సక్సెస్ లను అందుకోవాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు.

ఫస్ట్ హాఫ్ లో భారీ నుండి అతి భారీగా ప్లాప్ అయిన 15 సినిమాల లిస్ట్..!

Most Recommended Video

టాలీవుడ్ లో రీ ఎంట్రీ ఇవ్వబోతున్న 10 మంది హీరోయిన్స్ లిస్ట్..!
అభిమానులకు అవకాశాలు ఇచ్చి బ్లాక్ బస్టర్లు అందుకున్న హీరోలు..!
ఈ ఏడాది బాక్సాఫీస్ వద్ద సక్సెస్ అయిన 13 సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus