Jr NTR, Rajamouli: తారక్ జక్కన్న కాంబినేషన్ లో మరో మూవీ రానుందా?

యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ రాజమౌళి కాంబినేషన్ లో నాలుగు సినిమాలు తెరకెక్కాయనే సంగతి తెలిసిందే. ఈ కాంబినేషన్ లో తెరకెక్కిన స్టూడెంట్ నంబర్ 1, సింహాద్రి, యమదొంగ, ఆర్ఆర్ఆర్ సినిమాలు ఒక సినిమాను మించి మరొకటి విజయం సాధించాయి. ఆర్ఆర్ఆర్ సినిమా ఫుల్ రన్ లో ఏకంగా 1140 కోట్ల రూపాయలకు పైగా కలెక్షన్లను సొంతం చేసుకోవడం గమనార్హం. మహేష్ రాజమౌళి కాంబినేషన్ లో ఒక సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే.

ఈ సినిమాపై భారీ స్థాయిలో అంచనాలు నెలకొన్నాయి. అయితే ప్రస్తుతం సోషల్ మీడియాలో ఒక వీడియో చక్కర్లు కొడుతోంది. ఈ వీడియోలో తారక్ రాజమౌళితో చర్చలు జరపడం గమనార్హం. వైరల్ అవుతున్న ఈ వీడియోను చూసిన నెటిజన్లు తారక్ రాజమౌళి కాంబినేషన్ లో మరో సినిమా తెరకెక్కే అవకాశం ఉందని సోషల్ మీడియాలో కామెంట్లు వినిపిస్తుండటం గమనార్హం. తారక్ సోలో హీరోగా జక్కన్న మరో సినిమాను తెరకెక్కించాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.

మరి రాజమౌళి ఈ కాంబినేషన్ దిశగా అడుగులు వేస్తారో లేదో చూడాల్సి ఉంది. జక్కన్నకు ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఊహించని స్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. జక్కన్న దర్శకత్వం వహిస్తే సినిమాకు ఊహించని స్థాయిలో కలెక్షన్లు వచ్చే అవకాశాలు ఉంటాయి. మరి ఈ కాంబినేషన్ సెట్ అవుతుందో లేదో చూడాల్సి ఉంది. జక్కన్న తర్వాత ప్రాజెక్ట్ లు భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్నాయి.

జక్కన్న ఒక్కో సినిమాకు 100 కోట్ల రూపాయల రేంజ్ లో రెమ్యునరేషన్ తీసుకుంటున్నారు. సినిమాసినిమాకు జక్కన్న రెమ్యునరేషన్ పెరుగుతోందే తప్ప తగ్గడం లేదు. జక్కన్న డైరెక్షన్ లో ఒక్క సినిమా అయినా నిర్మించాలని చాలామంది నిర్మాతలు భావిస్తున్నారు. సినిమాసినిమాకు జక్కన్న రేంజ్ అంతకంతకూ పెరుగుతోంది. జక్కన్న డైరెక్షన్ లో నటించడానికి ఇతర భాషల హీరోలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

కాంతార సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

ఎన్టీఆర్ – సావిత్రి టు చిరు- నయన్.. భార్యాభర్తలుగా చేసి కూడా బ్రదర్- సిస్టర్ గా చేసిన జంటలు..!
తన 44 ఏళ్ల కెరీర్లో చిరంజీవి రీమేక్ చేసిన సినిమాలు మరియు వాటి ఫలితాలు..!
సౌందర్య టు సమంత.. గర్భవతి పాత్రల్లో అలరించిన హీరోయిన్ల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus