Jr NTR: యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ నేతాజీ రోల్ లో కనిపించనున్నారా?

  • July 27, 2024 / 12:46 PM IST

యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR) తన సినీ కెరీర్ లో ఎన్నో విభిన్నమైన పాత్రలను పోషించారు. తారక్ తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకోగా తారక్ సినిమాలు బడ్జెట్ల పరంగా కూడా ఒకింత టాప్ లో ఉన్నాయనే సంగతి తెలిసిందే. ప్రభాస్ (Prabhas) హను రాఘవపూడి (Hanu Raghavapudi) కాంబోలో ఫౌజీ టైటిల్ తో ఒక సినిమా తెరకెక్కుతుండగా ఈ సినిమాలో కొన్ని నిమిషాల పాటు నేతాజీ రోల్ లో తారక్ కనిపిస్తారని వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.

వైరల్ అవుతున్న వార్తలు నిజమో కాదో తెలీదు కానీ అభిమానులకు మాత్రం ఈ వార్తలు ఎంతో ఆనందాన్ని కలిగిస్తున్నాయని చెప్పవచ్చు. జూనియర్ ఎన్టీఆర్ నేతాజీ రోల్ కు పర్ఫెక్ట్ గా సూట్ అవుతారని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. జూనియర్ ఎన్టీఆర్ నుంచి ఇందుకు సంబంధించి క్లారిటీ రావాల్సి ఉంది. ప్రభాస్, ఎన్టీఆర్ కాంబో మాస్ కాంబో అని చెప్పడంలో ఎలాంటి సందేహం అవసరం లేదు.

జూనియర్ ఎన్టీఆర్ దేవర (Devara) ప్రమోషన్స్ లో భాగంగా వైరల్ అవుతున్న వార్తలకు సంబంధించి క్లారిటీ ఇస్తారేమో చూడాల్సి ఉంది. జూనియర్ ఎన్టీఆర్ దేవర ప్రమోషన్స్ త్వరలో మొదలుకానున్నాయి. బాలీవుడ్ ఇండస్ట్రీ తారక్ ఫస్ట్ ప్రయారిటీ అని సమాచారం అందుతోంది. బాలీవుడ్ లో ఈ సినిమాకు గ్రాండ్ గా ప్రమోషన్స్ జరిగేలా ప్లాన్స్ జరుగుతున్నాయని సమాచారం అందుతోంది.

యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో కెరీర్ ను నెక్స్ట్ లెవెల్ లో ప్లాన్ చేసుకుంటుండగా బాలీవుడ్ హీరోయిన్లు తారక్ కు జోడీగా నటిస్తున్నారు. పాన్ ఇండియా డైరెక్టర్ల డైరెక్షన్ లో తారక్ సినిమాలు తెరకెక్కుతుండగా బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో తారక్ ప్రేక్షకులను మెప్పించే ప్రయత్నం చేస్తున్నారు. తారక్ కెరీర్ ప్లానింగ్స్ మాత్రం నెక్స్ట్ లెవెల్ లో ఉన్నాయి.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus