Koratala Siva, Balakrisha: కొరటాల శివ బాలయ్యకు ఓకే చెబుతారా?

టాలీవుడ్ లో రాజమౌళి తర్వాత ఆ స్థాయి సక్సెస్ రేట్ ఉన్న దర్శకునిగా కొరటాల శివకు పేరుంది. మిర్చి, శ్రీమంతుడు, జనతా గ్యారేజ్, భరత్ అనే నేను సినిమాలతో టాలీవుడ్ లో కొరటాల శివ స్టార్ డైరెక్టర్ స్టేటస్ ను సొంతం చేసుకున్నారు. ఆచార్య సినిమాతో కొరటాల శివ ఖాతాలో బ్లాక్ బస్టర్ హిట్ గ్యారంటీ అనే కామెంట్లు వినిపిస్తున్నాయి. కొరటాల శివ ఇండస్ట్రీలోని స్టార్ హీరోలందరితో సినిమాలను చేయాలని భావిస్తున్నారు.

దర్శకుడు కాకముందే కొరటాల శివ పది సినిమాలకు సరిపడా స్క్రిప్ట్ లను సిద్ధం చేసుకున్నారు. ఇప్పటికే సీనియర్ హీరో అయిన చిరంజీవితో ఆచార్య సినిమాను తెరకెక్కించిన కొరటాల శివ తరువాత సినిమాను ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కించనున్నారు. బాలయ్యకు సూటయ్యే కథ కొరటాల శివ దగ్గర ఉన్నట్టు తెలుస్తోంది. కొరటాల శివ అడిగితే బాలకృష్ణ నో చెప్పే అవకాశం అయితే ఉండదు. అయితే యంగ్ జనరేషన్ స్టార్ హీరోలు సైతం కొరటాల శివతో సినిమా చేయాలని ఆసక్తి చూపుతున్న నేపథ్యంలో బాలయ్యతో సినిమాకు కొరటాల శివ ఓకే చెబుతారో లేదో చూడాల్సి ఉంది.

అటు బాలయ్యకు ఇటు కొరటాల శివకు వరుస కమిట్ మెంట్స్ ఉన్న నేపథ్యంలో ఈ కాంబినేషన్ లో మరో సినిమా రావడం తేలిక కాదు. అయితే టాప్ ప్రొడ్యూసర్ ఒకరు బాలయ్య కొరటాల శివ కాంబో దిశగా అడుగులు వేస్తున్నారని తెలుస్తోంది. కొరటాల శివ ప్రస్తుతం ఒక్కో సినిమాకు 20 కోట్ల రూపాయల స్థాయిలో పారితోషికం తీసుకుంటున్నారు.

పుష్పక విమానం సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

ప్రకటనలతోనే ఆగిపోయిన మహేష్ బాబు సినిమాలు ఇవే..!
రాజా విక్రమార్క సినిమా రివ్యూ & రేటింగ్!
3 రోజెస్ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus