బావమరిది సినిమా విషయంలో తారక్ అలా చేస్తారా?

  • September 12, 2022 / 06:31 PM IST

యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం కెరీర్ పరంగా జోరుమీదున్నారు. గత కొన్నేళ్లుగా తారక్ కెరీర్ ఫుల్ స్వింగ్ లో ఉంది. కెరీర్ విషయంలో తారక్ ఆచితూచి నిర్ణయాలు తీసుకుంటున్నారు. అయితే తారక్ బావమరిది నార్నె నితిన్ సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే. సతీష్ వేగేశ్న డైరెక్షన్ లో తెరకెక్కుతున్న సినిమాతో నార్నె నితిన్ టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయం కానున్నారు. అయితే ఎన్టీఅర్ బావమరిది సినిమా అయినప్పటికీ ఈ సినిమాకు సంబంధించి అంచనాలు పెరగడం లేదు.

కరోనా సెకండ్ వేవ్ సమయంలో షూటింగ్ మొదలైన ఈ సినిమా ఇప్పటికీ పూర్తి కాలేదు. సాధారణంగా పెద్దింటి నుంచి కొత్త హీరో ఎంట్రీ ఇస్తున్నారంటే ఊహించని స్థాయిలో హడావిడి ఉంటుంది. అయితే నార్నె నితిన్ విషయంలో మాత్రం అలాంటి హడావిడి ఏ మాత్రం లేకపోవడం నందమూరి ఫ్యాన్స్ కు బాధ కలిగిస్తోంది. జూనియర్ ఎన్టీఆర్ ఈ ప్రాజెక్ట్ ను పెద్దగా పట్టించుకోకపోవడమే ఈ సినిమాకు సమస్య అని బోగట్టా.

ఎన్టీఆర్ ఈ ప్రాజెక్ట్ పై కొంతమేర దృష్టి పెట్టినా ఈ సినిమాపై అంచనాలు మరింత పెరిగే ఛాన్స్ ఉంది. మరోవైపు ఎన్టీఆర్ ఈ మధ్య కాలంలో ఏదైనా ఈవెంట్ కు హాజరైతే ఆ సినిమాలకు కళ్లు చెదిరే స్థాయిలో కలెక్షన్లు వస్తున్నాయి. ఎన్టీఆర్ దృష్టి పెడితే నార్నె నితిన్ తొలి సినిమాతోనే ఊహించని రేంజ్ లో క్రేజ్ ను సొంతం చేసుకునే అవకాశం ఉంది.

ఈ సినిమా విడుదల కాకముందే నార్నె నితిన్ మరో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని ఈ సినిమాలో నార్నె నితిన్ ముగ్గురు హీరోలలో ఒకరిగా కనిపిస్తారని బోగట్టా. కెరీర్ తొలినాళ్లలో నార్నె నితిన్ ఇలాంటి రిస్కీ ప్రాజెక్ట్ లను ఎంచుకోవడం కరెక్ట్ కాదని కామెంట్లు వినిపిస్తున్నాయి. జూనియర్ ఎన్టీఆర్ ఈ సినిమా విషయంలో జోక్యం చేసుకుంటారో లేదో తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.

బిగ్ బాస్ 6 తెలుగు 21 మంది కంటెస్టెంట్స్ గురించి మీకు తెలియని ఆసక్తికరమైన విషయాలు!

Most Recommended Video

భూమా మౌనిక కు ఆల్రెడీ పెళ్లయిందా?
బిగ్ బాస్ కంటెస్టెంట్ రేవంత్ గురించి 10 ఆసక్తికరమైన విషయాలు..!
ఛార్మి మాత్రమే కాదు నిర్మాతలయ్యి భారీగా నష్టపోయిన హీరోయిన్ల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus