గత కొన్నేళ్లలో సినిమాలను చూసే విషయంలో ప్రేక్షకుల ఆలోచనలు, అభిప్రాయాలు పూర్తిస్థాయిలో మారిపోయాయి. టికెట్ రేట్లు భారీగా పెరగడంతో పాజిటివ్ టాక్ వస్తే తప్ప పెద్ద సినిమాలను చూడటానికి ప్రేక్షకులు థియేటర్లకు క్యూ కట్టడం లేదు. ప్రస్తుతం ఫ్యామిలీతో కలిసి సినిమాను థియేటర్ లో చూడాలంటే 1,000 రూపాయల నుంచి 2,000 రూపాయల వరకు ఖర్చు చేయాల్సి వస్తోంది. అందువల్ల ప్రేక్షకులు యావరేజ్ టాక్ వచ్చిన సినిమాలను సైతం థియేటర్లలో చూడటానికి ఆసక్తి చూపించడం లేదు.
ప్రభాస్ హీరోగా తెరకెక్కిన రాధేశ్యామ్ సినిమా కొంతమంది ప్రేక్షకులకు విపరీతంగా నచ్చేయగా కొంతమందిని మాత్రం అస్సలు ఆకట్టుకోలేదు. ఫలితంగా రాధేశ్యామ్ సినిమాకు 100 కోట్ల రూపాయలకు పైగా నష్టాలు వచ్చాయి. గతంలో ఏ సినిమా నష్టపోని స్థాయిలో రాధేశ్యామ్ కు నష్టాలు వచ్చాయని కామెంట్లు వినిపించాయి. అయితే ప్రభాస్ తన రెమ్యునరేషన్ లో 50 కోట్ల రూపాయలు త్యాగం చేసి నిర్మాతలను ఆదుకున్నారని ఇండస్ట్రీలో వినిపిస్తోంది. అయితే వైరల్ అవుతున్న ఈ వార్తలో నిజానిజాలు తెలియాల్సి ఉంది.
ప్రస్తుతం ప్రభాస్ వెకేషన్ లో ఉన్నారనే సంగతి తెలిసిందే. వెకేషన్ నుంచి వచ్చిన తర్వాత ప్రభాస్ రాధేశ్యామ్ నష్టాలపై మరోసారి దృష్టి పెట్టనున్నారని తెలుస్తోంది. ప్రభాస్ నిజంగా గ్రేట్ అని నెటిజన్లు మెచ్చుకుంటున్నారు. ప్రభాస్ భవిష్యత్తు సినిమాలపై భారీ అంచనాలు నెలకొన్నాయి. వరుస ఫ్లాపుల వల్ల ప్రభాస్ కెరీర్ పై ప్రభావం పడే ఛాన్స్ ఉంది. ప్రభాస్ నటించిన ఆదిపురుష్ 2023 సంక్రాంతి కానుకగా రిలీజ్ కానుంది.
ప్రభాస్ మారుతి డైరెక్షన్ లో ఒక సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వగా ఆ సినిమా షూటింగ్, ఇతర వివరాలు తెలియాల్సి ఉంది. మారుతి ప్రభాస్ తో కచ్చితంగా బ్లాక్ బస్టర్ హిట్ తీయాలని భావిస్తున్నారు. పరిమిత బడ్జెట్ తోనే ఈ సినిమా తెరకెక్కనుందని తెలుస్తోంది. ఈ సినిమాకు సంబంధించి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
Most Recommended Video
‘బాహుబలి’ కి ఉన్న ఈ 10 అడ్వాంటేజ్ లు ‘ఆర్.ఆర్.ఆర్’ కు లేవట..!
‘ఆర్.ఆర్.ఆర్’ మూవీ గురించి ఈ 11 ఇంట్రెస్టింగ్ విషయాలు మీకు తెలుసా?
‘పుష్ప’ తో పాటు బుల్లితెర పై రికార్డ్ టి.ఆర్.పి లు నమోదు చేసిన 10 సినిమాల లిస్ట్…?