టాలీవుడ్లో ఉన్న సక్సెస్ ఫుల్ డైరెక్టర్స్ లో వంశీ పైడిపల్లి (Vamshi Paidipally) ఒకరు. ప్రభాస్ తో (Prabhas) చేసిన ‘మున్నా’ (Munna) తీసేస్తే… అతను చేసిన సినిమాలు అన్నీ హిట్లే. ఎన్టీఆర్ తో (Jr NTR) ‘బృందావనం’ (Brindavanam), రాంచరణ్ తో (Ram Charan) ‘ఎవడు’ (Yevadu), మహేష్ బాబుతో (Mahesh Babu) ‘మహర్షి’(Maharshi) , విజయ్ తో (Vijay Thalapathy) ‘వరిసు'(Varisu) … ఇలా అతను చేసిన సినిమాలు సక్సెస్ సాధించాయి. అయితే 2023 లో వచ్చిన ‘వరిసు’ తర్వాత ఇతని నుండి మరో సినిమా రాలేదు. అమిర్ ఖాన్ తో ఓ సినిమా చేయాలని గట్టిగా ట్రై చేశాడు.
కానీ ఆమిర్ ఖాన్ (Aamir Khan) ఇప్పుడు వేరే ప్రాజెక్టులతో బిజీగా ఉండటం వల్ల చేసే అవకాశం లేదు. వంశీ పైడిపల్లితో ఉన్న ఇబ్బంది ఏంటంటే.. స్టార్ హీరోతో అయితేనే అతను సినిమా చేస్తాడు. వేరే హీరోలతో సినిమాలు చేయడానికి అతను ఇంట్రెస్ట్ చూపించడు. అదేంటి అంటే.. ‘నేను చిన్నప్పుడు, చదువుకుంటున్నప్పుడు పెద్ద పెద్ద వాళ్ళతోనే తిరిగే వాడిని, నేను పెద్ద రేంజ్ ఉన్నవాళ్ళతో తిరగడం వల్లనే ఇలా ఉన్నాను’ అంటూ చెబుతుంటాడు.
సో పెద్ద వాళ్ళైతేనే తన ఎదుగుదలకు బాగుంటుంది అనేది అతని ఉద్దేశం కావచ్చు. అన్నిటికీ మించి అతనికి దిల్ రాజు (Dil Raju) సపోర్ట్ ఉంది. అతని బ్యానర్లోనే వంశీ పైడిపల్లి ఎక్కువ సినిమాలు చేస్తుంటాడు. అంత పెద్ద బ్యానర్ సపోర్ట్ ఉన్నప్పుడు మిడ్ రేంజ్ హీరోలతో సినిమాలు చేయాలని అనుకోడు వంశీ. ఏళ్ళకి ఏళ్ళు పెద్ద హీరోల కోసమే ఎదురు చూస్తూ ఉంటే ఎలా? ఇలా అయితే అతన్ని జనాలు మర్చిపోయే ప్రమాదం కూడా లేకపోలేదు.