భీమ్లా నాయక్ డైరెక్టర్ తో బెల్లంకొండ సినిమా ఉన్నట్టా.. లేనట్టా?

బెల్లంకొండ సాయి శ్రీనివాస్ టాలీవుడ్లో ఉన్న క్రేజీ హీరోల్లో ఒకరు. ఇతని సినిమాలకి మంచి మార్కెట్ ఉంది. బడ్జెట్ ను అదుపులో పెట్టుకుని తీస్తే కనుక లాభాలు బాగానే వస్తాయి. ‘రాక్షసుడు’ విషయంలో ఇదే జరిగింది. ఎందుకంటే ఇతని సినిమాల హిందీ డబ్బింగ్ హక్కులకు మంచి మార్కెట్ ఉంది కాబట్టి..! ‘రాక్షసుడు’ సినిమాకి రెండింతల లాభాలు వచ్చాయి. అయితే ఆ తర్వాత సాయి శ్రీనివాస్ నటించిన ‘అల్లుడు అదుర్స్’ ‘ఛత్రపతి'(హిందీ రీమేక్) సినిమాలు పెద్దగా ఆడలేదు.

ఆ తర్వాత అతని నుండి మరో సినిమా రాలేదు. ప్రస్తుతం ఇతను ‘భీమ్లా నాయక్’ దర్శకుడితో ఓ సినిమా చేస్తున్నాడు. అయితే ఈ సినిమా షూటింగ్లకి సంబంధించిన అప్డేట్స్ ఏమీ రాలేదు. ఒకానొక టైంలో అయితే… ఈ సినిమా షూటింగ్ ప్రారంభమైన కొద్దిరోజులకే.. ఆగిపోయింది అంటూ కామెంట్లు మొదలయ్యాయి. ఎందుకంటే ఈ చిత్రాన్ని ‘ఏకె ఎంటర్టైన్మెంట్స్’ సంస్థ పై అనిల్ సుంకర నిర్మిస్తున్నారు. ఆయన గత సినిమాలు ‘మహాసముద్రం’ ‘ఏజెంట్’ ‘భోళా శంకర్’ వంటివి దారుణంగా ప్లాప్ ఆయాయ్యి.

‘భోళా శంకర్’ సినిమా రిలీజ్ కి .. రెండు రోజుల ముందు అనిల్ సుంకర పై కేసు పడింది. మరోపక్క అభిషేక్ పిక్చర్స్ అధినేత కూడా తనకు ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వలేదు అంటూ ప్రొడ్యూసర్ కౌన్సిల్ లో కంప్లైంట్ చేశాడు. ఇక అతని ‘ఊరి పేరు భైరవ కోన’ సినిమా కూడా రిలీజ్ కాలేదు. అందుకే బెల్లంకొండ సాయి శ్రీనివాస్ సినిమాపై.. నెగిటివ్ కామెంట్లు వినిపించాయి.

అయితే ఆ సినిమా ఆగిపోలేదు అని చిత్ర బృందం తెలిపింది. అక్టోబర్ 30 నుండి కొత్త షెడ్యూల్ ప్రారంభం కానుంది అని వారు చెబుతున్నారు. ఇక ఈ చిత్రంలో (Bellamkonda Sai Srinivas) బెల్లంకొండ సాయి శ్రీనివాస్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించబోతున్నాడట.

భగవంత్ కేసరి సినిమా రివ్యూ & రేటింగ్!

లియో సినిమా రివ్యూ & రేటింగ్!
టైగర్ నాగేశ్వరరావు సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus