ఇండియన్ ఫిలిమ్ ఇండస్ట్రీలో రాంగోపాల్ వర్మ స్థాయి అద్భుతమైన టెక్నీషియన్ మరొకరు లేరు అనేది ఎంతటి నిజమో.. ఆయనంత మెంటలోడు లేడు అనేది కూడా అంతే నిజం. ఈ విషయాన్ని ఎవరో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు, వర్మ స్వయంగా తనపై తాను సెటైర్స్ వేసుకొంటూ ఈ తరహా స్టేట్ మెంట్ ఇస్తాడు. కానీ… ఒక్క విషయంలో మాత్రం వర్మను మెచ్చుకోవాలి.. నిజాన్ని నిర్భయంగా మాట్లాడడమే కాక తప్పు చేస్తే పబ్లిక్ గా ఒప్పుకొని మరీ క్షమాపణలు కోరతాడు. అందుకే వర్మకి ఎంతమంది హేటర్స్ ఉన్నా.. ఆయన్ని ఆరాధించి, అభిమానించే వాళ్ళే ఎక్కువగా ఉంటారు. ఇక వర్మ శిష్యులైతే ఆయన్ని దేవుడిలా కొలుస్తారు.
కానీ.. ఇటీవల “ఆర్ ఎక్స్ 100″తో అఖండ విజయం సొంతం చేసుకొన్న అజయ్ భూపతి మాత్రం వర్మలోని నీచుడ్ని అందరికీ చూపిస్తాను అంటున్నాడు. “వర్మలో చాలా యాంగిల్స్ ఉన్నాయి. ఆయన్ని పూర్తిస్థాయిలో అర్ధం చేసుకోవడం ఎవరి తరమూ కాదు. ఎప్పటికైనా ఆయన జీవితాన్ని ఆధారంగా చేసుకొని ఆయన బయోపిక్ ను తెరకెక్కిస్తాను. ఆయనలోని నీచుడ్ని అందరికీ పరిచయం చేస్తాను” అంటున్నాడు అజయ్ భూపతి. అదే సమయంలో వర్మ స్థాయిలో సినిమాని అర్ధం చేసుకొన్నవాళ్ళెవరూ లేరని కూడా అజయ్ కితాబులిస్తుండడం గమనార్హం.