తెలుగు చిత్ర పరిశ్రమలో మెగా హీరోలకి ఎక్కువగా అభిమాన ఘనం ఉంది. అందుకే వారి చిత్రాలకు సహజంగానే భారీ ఓపెనింగ్స్ వస్తుంటాయి. కానీ సినిమా బాగాలేకుంటే ఎంతటి మెగా హీరో చిత్రానికైనా టికెట్లు తెగవని రీసెంట్ గా వచ్చిన తేజ్ ఐ లవ్ యు మూవీ నిరూపించింది. సుమారు 650 కి పైగా థియేటర్స్ లో రిలీజ్ అయిన సాయి ధరమ్ తేజ్ మూవీ మొదటిరోజు 1.8 కోట్ల షేర్ మాత్రమే రాబట్టగలిగింది. సినిమాలో కొత్తదనం లేదని విస్తరించడంతో రెండో రోజు నుంచి కలెక్షన్లు ఘోరంగా పడిపోయాయి. అయితే నిన్న రామ్ గోపాల్ వర్మ శిష్యుడు అజయ్ భూపతి దర్శకత్వం వహించిన ఆర్ఎక్స్ 100 రిలీజ్ అయింది.
కార్తికేయ హీరోగా నటించిన ఈ సినిమా టీజర్, ట్రైలర్ తో బాగానే ఆకర్షించింది. అందుకే మంచి ఓపెనింగ్స్ వచ్చాయని సమాచారం. అశోక్ రెడ్డి గుమ్మకొండ నిర్మించిన ఈ చిత్రం ఊహించినదానికన్నా ఎక్కువ ఓపెనింగ్స్ వచ్చాయని ట్రేడ్ వర్గాల వారు తెలిపారు. కలక్షన్ల మొత్తాన్ని వెల్లడించడానికి చిత్ర బృందం నిరాకరించినప్పటికీ తేజ్ ఐ లవ్ యు సినిమా వారం మొత్తం సాధించిన గ్రాస్ కంటే ఆర్ఎక్స్ 100 మూవీ ఒక్కరోజులో సాధించిన గ్రాస్ ఎక్కువమని సమాచారం. ఇది మెగా హీరోలకి అవమానమని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు. సినీ రంగంలో ఎంతో అనుభవం ఉన్న మెగా హీరోలు ఇక నుంచి అయినా కథల ఎంపికలో జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు.