Jr NTR: సింగిల్ టేక్ లో ఎన్టీఆర్ అలా చేస్తారన్న గోపాల్ రెడ్డి!

సినిమాటోగ్రాఫర్ గా, రచయితగా, దర్శకుడిగా, నిర్మాతగా ఎస్.గోపాల్ రెడ్డి ఇండస్ట్రీలో ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్నారు. ఒక ఇంటర్య్వూలో ఎస్.గోపాల్ రెడ్డి మాట్లాడుతూ అప్పటికాలంలో వచ్చిన తెలుగు సినిమాలు మళ్లీ ఇప్పుడు రావా అని తనకు అనిపిస్తుందని ఆయన అన్నారు. ఆ భయం, బాధ రెండూ ఉంటాయని ఆయన చెప్పుకొచ్చారు. బాలయ్య బాబుకు సినిమా అంటే మహా ప్రేమ అని ఎస్.గోపాల్ రెడ్డి వెల్లడించారు. తండ్రిగారిని పుణికిపుచ్చుకున్న మనిషి బాలయ్య అని ఆయన అన్నారు.

జూనియర్ ఎన్టీఆర్ నటించిన రాఖీ అనే సినిమాను మేము ప్రొడ్యూస్ చేశామని జూనియర్ ఎన్టీఆర్ సెట్ లో అల్లరిగా ఉంటాడని సీన్ ను జూనియర్ ఎన్టీఆర్ ఎప్పుడు చదివి ఉంటాడో తనకు అసలు అర్థమే కాదని ఆయన వెల్లడించారు. షాట్ రెడీ అని చెప్పగానే సింగిల్ టేక్ లో రెండు మూడు పేజీల డైలాగ్ లను తెలుగు పర్ఫెక్ట్ డిక్షన్ తో జూనియర్ ఎన్టీఆర్ చెబుతారని ఎస్.గోపాల్ రెడ్డి అన్నారు. గ్లిజరిన్ లేకుండా జూనియర్ ఎన్టీఆర్ ఎమోషన్స్ ను పండిస్తాడని ఆయన అన్నారు.

ఎవరైనా వచ్చి జూనియర్ ఎన్టీఆర్ లో పూనారా అనే విధంగా అతని యాక్షన్ ఉంటుందని ఎస్.గోపాల్ రెడ్డి కామెంట్లు చేశారు. తారక్ కు పూర్వజన్మ సుకృతం ఉందని తనకు అనిపిస్తుందని సీనియర్ ఎన్టీఆర్ ను మరిపించేలా ఎన్టీఆర్ డైలాగ్ ఉంటుందని ఎస్.గోపాల్ రెడ్డి అన్నారు. జూనియర్ ఎన్టీఆర్ ను చూస్తే చాలా ఆశ్చర్యం వేస్తుందని ఆయన పేర్కొన్నారు. అతని వయస్సుకు ఇంత సక్సెస్ ఎలా మోస్తున్నాడో ఇంతమందిని ఎలా హ్యాండిల్ చేస్తున్నాడో అర్థం కాదని ఆయన తెలిపారు.

జూనియర్ ఎన్టీఆర్ కు గాడ్ ఫాదర్ లేరని తారక్ ఈ స్థాయికి చేరుకోవడం చాలా గొప్ప విషయమని ఎస్.గోపాల్ రెడ్డి అన్నారు. ఎస్.గోపాల్ రెడ్డి ఎన్టీఆర్ గురించి చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

‘ఆర్.ఆర్.ఆర్’ మూవీ నుండీ అదిరిపోయే 20 డైలాగులు..!

Most Recommended Video

‘ఆర్.ఆర్.ఆర్’ తో పాటు ఫస్ట్ వీక్ తెలుగు రాష్ట్రాల్లో భారీ వసూళ్ళను రాబట్టిన సినిమాల లిస్ట్..!
‘ప్రతిఘటన’ తో గోపీచంద్ తండ్రి టి.కృష్ణ దర్శకత్వం వహించిన సినిమాల లిస్ట్..!
5 ఏళ్ళ కెరీర్ లో రష్మిక మందన మిస్ చేసుకున్న సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus