ఈ సీన్లకి ఫ్యాన్స్ కు పూనకాలు రావడం ఖాయమట

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా హై బడ్జెట్ తో తెరకెక్కిన చిత్రం ‘సాహో’. ఆగష్టు 30 న అంటే మరో రెండు రోజుల్లో ఈ చిత్రం విడుదల కాబోతుంది. ఇక ఈ చిత్రం సెన్సార్ ప్రపంచవ్యాప్తంగా అన్ని భాషలు వెర్షన్లకు పూర్తి కాగా… కొన్ని సీన్ల గురించి లీకులు కూడా ఇచ్చేశారు. వారి సమాచారం మేరకు ఐదు సీన్స్ హైలైట్ అట. ‘సాహో’ లో ప్రభాస్ ఎంట్రీ ఓ రేంజ్లో ఉండబోతుందట. అభిమానులకి గూస్ బంప్స్ రావడం గ్యారంటీ అని చెబుతున్నారు.

ఇక ఇంటర్నేషనల్ యాక్షన్ డైరెక్టర్ పెంగ్ జాంగ్ దీన్ని డైరెక్ట్ చేయగా, ఈ సీన్ కోసం ప్రభాస్ మూడు వారాల పాటు ట్రైనింగ్ తీసుకున్నాడట.బాబ్ బ్రాన్ డైరెక్ట్ చేసిన గన్ షాట్ సీన్ హైలెట్ అట. ఇది రెండో హైలెట్ అని తెలుస్తుంది. డ్యాన్స్ నంబర్ లా ఉండే ఈ ఫైట్ ఇప్పటివరకూ ఇండియన్ స్క్రీన్ పై రాలేదని తెలుస్తుంది. కార్ ఛేజ్ సీన్ మూడో హైలెట్ అట. ఈ సీన్స్ ను మరో ఇంటర్నేషనల్ డైరెక్టర్ కెన్నీ బ్యాట్స్ డైరెక్ట్ చేశాడని తెలుస్తుంది. దీన్ని మూడు వారాల పాటు అబూదాబీలో షూట్ చేశారట. జెట్ మ్యాన్ సీన్ నాలుగో హైలెట్ అట. ఈ సీన్ ను ‘బాహుబలి’ షూటింగ్ పూర్తికాకుండానే తీసేశారట. ‘బాహుబలి-2’ ప్రీ రిలీజ్ లో విడుదల చేసిన టైములో దీనికి సంబందించిన టీజర్ ను చూపించిన సంగతి తెలిసిందే. ఈ సీన్స్ ఇటలీలో షూట్ చేశారట. జెట్ సూట్ వేసుకుని ప్రభాస్ గాల్లో తేలిపోతూ అద్భుతంగా నటించాడట. క్లయిమాక్స్ ఐదో హైలెట్ అని తెలుస్తుంది. ఈ సీన్స్ కూడా పెగ్ జాంగ్ సాయంతో యూరప్ లో చిత్రీకరించారట. హీరోయిజం పీక్స్ లో ఉండి, అభిమానులను సీట్లలో కూర్చోనివ్వకుండా ఈ క్లైమాక్స్ ఉండబోతుందట. మరి ఈ సీన్లకి థియేటర్లలో ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో చూడాలి..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus