సాహోకి మిగిలి ఉన్న 180 రోజులు
- August 10, 2017 / 12:20 PM ISTByFilmy Focus
సుజీత్ దర్శకత్వంలో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ చేస్తున్న సాహో మూవీపై భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. అభిమానుల అంచనాలకు మించి సినిమా ఉండాలని నిర్మాతలు వంశీ, ప్రమోద్ లు భావిస్తున్నారు. అందుకే మూవీ బడ్జెట్ ని 150 కోట్ల నుంచి 225 కోట్లకు పెంచారు. ఈ సినిమా కోసం తాజాగా రామోజీ ఫిలిం సిటీలో 5 కోట్లతో భారీ సెట్ ని నిర్మిస్తున్నారు. అయితే ఈ సినిమా గురించి ఓ ఆసక్తికర న్యూస్ బయటికి వచ్చింది. ఈ చిత్రాన్ని 187 రోజుల్లో కంప్లీట్ చేయాలనీ డైరక్టర్ షెడ్యూల్ ప్లాన్ చేసినట్లు తెలిసింది. అందులో ఇప్పటికీ ఏడు రోజుల షూటింగ్ కంప్లీట్ అయిందని సమాచారం. టీజర్ కోసం ప్రభాస్ రెండు రోజులు పనిచేశారు.
అలాగే విలన్ పాత్ర దారి నీల్ నితిన్ ముఖేష్ పై హైదరాబాద్ సెంట్రల్ లైబ్రరీలో కొన్ని సీన్లు షూట్ చేశారు. మిగిలిన 180 రోజుల్లో సినిమాని కంప్లీట్ చేయనున్నట్లు చిత్ర బృందం తెలిపింది. సాధారణంగా ఒక సినిమాకి మూడు నెలలు (90 రోజులు) సరిపోతాయి. అయితే సాహో లో ఎక్కువగా యాక్షన్ సీన్స్ ఉండడం వల్ల ఆరు నెలల సమయం పడుతోంది. అంటే వచ్చే వేసవి వరకు ప్రొడక్షన్ వర్క్ జరగనుందన్నమాట.
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

















