భారీగా ‘సాహో’ బిజినెస్.. ప్రభాస్ క్రేజ్ ట్రేడ్ కి సైతం షాకిస్తుంది…!

ప్రభాస్ అభిమానులంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రం ‘సాహో’. ‘బాహుబలి’ తరువాత ఈ చిత్రం కోసం రెండేళ్ళకు పై నుండీ ఎదురుచూస్తున్నారు. ఒక్క తెలుగు ప్రేక్షకులు మాత్రమే కాదు.. హిందీ, తమిళ, మలయాళ ప్రేక్షకులు సైతం ఈ చిత్రం కోసం ఎంతో ఆసక్తితో ఎదురుచూస్తున్నారు. ‘బాహుబలి’ తరువాత ప్రభాస్ గత చిత్రాలను కూడా మిగిలిన భాషల్లో డబ్ చేయగా అక్కడా కూడా హిట్టయ్యాయి. ఆఖరికి ప్రభాస్ ప్లాప్ సినిమాలు కూడా అక్కడ హిట్టవ్వడం విశేషం. ప్రభాస్ క్రేజ్ ఆ రేంజ్లో పెరిగింది మరి. ఇక తాజాగా విడుదల చేసిన టీజర్ కి కూడా భారీ రెస్పాన్స్ రావడంతో ఈ చిత్రం పై అంచనాలు మరింత పెరిగాయి.

అందుకే ‘సాహో’ చిత్రం డిస్ట్రిబ్యూషన్ హక్కులకు భారీ డిమాండ్ ఏర్పడింది. తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రం బిజినెస్ ఆకాశాన్ని అంటుకుంటున్నాయి. ముఖ్యంగా గోదావరి జిల్లాల్లో ‘సాహో’ రేట్లు చూస్తే షాక్ తగలక మానదు. అందుతున్న సమాచారం ప్రకారం… ఇండస్ట్రీ వర్గాల సమాచారం మేరకు తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల హక్కులు 20 కోట్లు పలుకుతున్నాయట. ‘బాహుబలి 2’ చిత్రానికి తూర్పు గోదావరి జిల్లాలో 10 కోట్లు, పశ్చిమ గోదావరిలో 8 కోట్లకు బిజినెస్ జరిగింది. ఇంత పెద్దమొత్తం వెనక్కి రాబట్టాలంటే చిత్రానికి మొదటిరోజే హిట్టు టాక్ రావడంతో పాటూ.. మొదటిరోజే భారీ ఓపెనింగ్స్ ను రాబట్టాలి. అప్పుడే ఇంత పెద్దమొత్తం పెట్టి కొన్నవారు లాభాలు చూడగలరు. మరి ఈ చిత్రం రెస్పాన్స్ ఎలా ఉంటుందో ఆగష్టు 15 వరకూ ఎదురుచూడాల్సిందే.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus