స్పెషల్ ఫోటోషూట్ తో స్టామినా ప్రూవ్ చేసుకొంది

ఒక్కోసారి సినిమాలు సూపర్ హిట్ అయినా కూడా హీరోయిన్ కి కనీస స్థాయి గుర్తింపు రాదు. ఏదో లక్కీగా “ఫిదా, తొలిప్రేమ” లాంటి సినిమాలు మాత్రమే హీరోయిన్స్ కి గుర్తింపు తెచ్చిపెట్టాయి. కానీ.. సినిమాల రిజల్ట్స్ అనేవి హీరోయిన్ల కెరీర్ ను ఏమాత్రం ఎఫెక్ట్ చేయవు. కానీ.. గతవారం విడుదలైన “సాక్ష్యం” సినిమా ఎఫెక్ట్ పాపం పూజా హెగ్డేపై గట్టిగానే పడింది. విడుదల రోజు ఉదయం నుంచే కొన్ని సమస్యలు ఎదుర్కొన్న “సాక్ష్యం” బాక్సాఫీస్ వద్ద యావరేజ్ గా నిలవగా.. ఈ చిత్రంలో పూజా హెగ్డే నటన, లుక్స్ మాత్రం టాక్ ఆఫ్ ది టౌన్ గా మారాయి.
“దువ్వాడ జగన్నాధం” చిత్రంలో హాట్ & ట్రెండీగా కనిపించిన పూజా హెగ్డే.. “సాక్ష్యం” సినిమాలో మాత్రం చాలా నీరసంగా, డీగ్లామరస్ గా కనిపించింది. ఆమె కాస్ట్యూమ్స్ కానీ.. హెయిర్ స్టైల్ కానీ చాలా విచిత్రంగా కనిపించాయి.

దాంతో పూజా హెగ్డే హార్డ్ కోర్ ఫ్యాన్స్ కూడా “పూజ ఇలా ఉందేంటి?” అని అవాక్కయ్యారు. ఈ కామెంట్ కి అందరికంటే ఎక్కువగా షాక్ అయ్యింది ప్రభాస్ హీరోగా త్వరలోనే ఓ ప్రేమకథను తెరకెక్కించనున్న రాధాకృష్ణ. ఈ చిత్రంలో పూజా హెగ్డేను హీరోయిన్ గా అనుకొన్నారు. కానీ.. “సాక్ష్యం”తో వచ్చిన ఫీడ్ బ్యాక్ కారణంగా ఇటీవల ఆమెతో ఒక ఫోటోషూట్ చేశారట. ఆ ఫోటోషూట్ లో పూజా 100% స్కోర్ సాధించడంతో అప్పటివరకూ ఉన్న అనుమానాలన్నీ చెల్లాచెదురయ్యాయి. ఈ ఫోటోషూట్ అనంతరం ప్రభాస్ సరసన పూజా హెగ్డే కన్ఫర్మ్ అయ్యింది. త్వరలోనే అధికారికంగా చిత్రబృందం ఈ విషయాన్ని ప్రకటించనుంది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus