Saanve Megghana, Allu Arjun: బన్నీపై అభిమానాన్ని చాటుకున్న శాన్వీ మేఘన!

స్టార్ హీరో అల్లు అర్జున్ కు ప్రేక్షకుల్లో ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ అంతాఇంతా కాదు. బన్నీ సినిమా రిలీజైతే బాక్సాఫీస్ వద్ద కొత్త రికార్డులు క్రియేట్ కావాల్సిందేనని చెప్పవచ్చు. టాలీవుడ్ నటి శాన్వీ మేఘన పుష్పక విమానం సినిమాలో ఒక హీరోయిన్ గా నటించిన సంగతి తెలిసిందే. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా శాన్వీ మేఘన మాట్లాడుతూ ఆసక్తికర విషయాలను చెప్పుకొచ్చారు. ప్రీ రిలీజ్ ఈవెంట్ లో బన్నీ హగ్ ఇచ్చారని సింపుల్ గా చెప్పాలంటే ఆ రాత్రి నేను పడుకోలేదని శాన్వీ మేఘన అన్నారు.

ఇది జోక్ కూడా కాదని సీరియస్ గానే తాను నిద్రపోలేదని మమ్మీ.. అల్లు అర్జున్ మమ్మీ అని తాను అమ్మతో చెప్పానని శాన్వీ మేఘన కామెంట్లు చేశారు. అల్లు అర్జున్ అంటే తనకు ఎంతో గౌరవం, అభిమానం ఉన్నాయని శాన్వీ మేఘన తెలిపారు. నా సినిమా ట్రైలర్ లాంఛ్ కు బన్నీ రావడం చాలా సంతోషంగా అనిపించిందని శాన్వీ మేఘన కామెంట్లు చేశారు. అల్లు అర్జున్ హగ్ చేసుకున్న ఫీలింగ్ చాలా స్పెషల్ అని బనీ హగ్ చేసుకోవడం ఇప్పటికి కూడా తనకు నమ్మాలని అనిపించడం లేదని శాన్వీ మేఘన వెల్లడించారు.

పుష్పక విమానం సినిమాకు పాజిటివ్ టాక్ వచ్చినా ఈ సినిమాకు ఆశించిన స్థాయిలో కలెక్షన్లు రావడం లేదు. పుష్పక విమానం మూవీలో షార్ట్ ఫిల్మ్ హీరోయిన్ రోల్ లో నటించి శాన్వీ మేఘన మెప్పించారు. బబ్లీ రోల్ లో నటించి శాన్వీ మేఘన ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. బిలాల్ పూర్ పోలీస్ స్టేషన్, పిట్టకథలు, సైరా నరసింహారెడ్డి, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ లలో శాన్వీ మేఘన కీలక పాత్రల్లో నటించి మెప్పించిన సంగతి తెలిసిందే.

పుష్పక విమానం సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

ప్రకటనలతోనే ఆగిపోయిన మహేష్ బాబు సినిమాలు ఇవే..!
రాజా విక్రమార్క సినిమా రివ్యూ & రేటింగ్!
3 రోజెస్ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus