ఆది పినిశెట్టి (Aadhi Pinisetty) లేటెస్ట్ మూవీ ‘శబ్దం’ (Sabdham) బాక్సాఫీస్ వద్ద స్ట్రగుల్ అవుతుంది.ఫిబ్రవరి 28న రిలీజ్ అయిన ఈ సినిమాకి అరివళగన్ (Arivazhagan Venkatachalam) దర్శకుడు. తమన్ (S.S.Thaman) సంగీతం అందించారు. 14 ఏళ్ళ క్రితం ఇదే కాంబినేషన్లో ‘వైశాలి’ వచ్చింది. తెలుగులో అది బాగా ఆడింది. ‘శబ్దం’ పై మొదటి నుండి పాజిటివ్ బజ్ ఏర్పడటానికి కారణం అదే. అయితే మొదటి రోజు ఈ సినిమా పర్వాలేదు అనిపించే టాక్ తెచ్చుకుంది. కానీ ‘వైశాలి’ రేంజ్ టాక్ రాలేదు.
దీంతో యావరేజ్ ఓపెనింగ్స్ కే పరిమితమైంది. వీక్ డేస్ లో అయితే ఈ సినిమా బాగా డౌన్ అయ్యింది. ఒకసారి 5 డేస్ కలెక్షన్స్ ని గమనిస్తే :
నైజాం | 0.37 cr |
సీడెడ్ | 0.15 cr |
ఆంధ్ర(టోటల్) | 0.36 cr |
ఏపీ + తెలంగాణ(టోటల్) | 0.88 cr |
‘శబ్దం’ సినిమాకి తెలుగులో రూ.1.20 కోట్లు థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కావాలంటే రూ.1.5 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది. అయితే 5 రోజుల్లో ఈ సినిమా రూ.0.88 కోట్లు షేర్ ను రాబట్టింది. గ్రాస్ పరంగా రూ.1.43 కోట్లు కలెక్ట్ చేసినట్లు తెలుస్తుంది. మొత్తంగా బ్రేక్ ఈవెన్ కి మరో రూ.0.62 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది. ప్రస్తుతానికైతే బ్రేక్ ఈవెన్ అయ్యే అవకాశాలు కనిపించడం లేదు. ఏదైనా అద్భుతం జరిగితే తప్ప.. అది అసాధ్యంగానే కనిపిస్తుంది.