Sada Nannu Nadipe Review: సదా నన్ను నడిపే సినిమా రివ్యూ & రేటింగ్!

  • June 25, 2022 / 12:59 PM IST

‘వాన‌విల్లు’ అనే చిత్రంతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన ప్రతీక్ ప్రేమ్ క‌ర‌ణ్ కొంచెం గ్యాప్ తీసుకుని చేసిన చిత్రం ‘ సదా నన్ను నడిపే ‘. ఇది కూడా లవ్ స్టోరీ అని ప్రచార చిత్రాలు చూసిన వెంటనే అందరికీ ఓ క్లారిటీ వచ్చేసింది. ఈ మధ్య కాలంలో కొంచెం బజ్ సంపాదించుకున్న సినిమాల్లో ఇది కూడా ఒకటి.

వైష్ణవి పట్వర్ధన్ హీరోయిన్ గా నటించిన ఈ చిత్రంలో నాగేంద్ర బాబు, నాజర్, రాజీవ్ కనకాల, ఆలీ వంటి పెద్ద నటీనటులు ఉండడంతో ఈ సినిమా పై కొద్దిపాటి అంచనాలు కూడా మొదలయ్యాయి. మరి ఆ అంచనాలకు తగ్గట్టు ఈ సినిమా ఉందా? లేదా? అనేది తెలుసుకుందాం రండి.

కథ: మైఖేల్ జాక్సన్ అలియాస్ ఎం.జె (ప్రతీక్ ప్రేమ్ కరణ్) ఓ బస్తీ లో నివసించే కుర్రాడు. చిన్న చిన్న దొంగతనాలు చేస్తూ మరోపక్క స్నేహితులతో సరదాగా గడుపుతూ ఉంటాడు. ఇంతలో అతని జీవితంలోకి సమయ హాసిని అలియాస్ సాహా(వైష్ణవి పట్వర్ధన్) అనే అమ్మాయి వస్తుంది. అనుకోని సందర్భంలో అతనికి.. ఆమెతో పరిచయం ఏర్పడడం.. ప్రేమలో పడటం జరుగుతుంది.కానీ ఆమె అతని ప్రేమను వెంటనే యాక్సెప్ట్ చేయదు.

కానీ ఎం.జె ఎంతో సిన్సియర్ గా ప్రేమిస్తున్నాడు అని తెలిసి అతని లవ్ ని యాక్సెప్ట్ చేసి… తన తండ్రి(రాజీవ్ కనకాల) కి ఇష్టం లేకపోయినా ఎదురించి పెళ్లి చేసుకుంటుంది. కానీ పెళ్ళైన తర్వాత నుండి సహా.. ఎం.జె ని దగ్గరకు రానివ్వదు. దూరం పెడుతుంది. ఆమె ఓ వ్యాధితో బాధపడటం వల్ల… ఎక్కువ కాలం బ్రతకలేదు అనే కారణంతో అతన్ని దూరం పెడుతుంది అని ఎం.జె కి ఆలస్యంగా తెలుస్తుంది. మరి ఇలాంటి పరిస్థితుల్లో ఎం.జె.. సాహాని బ్రతికించుకోవడానికి ఎలాంటి ప్రయత్నాలు చేశాడు? చివరికి ఆమె బ్రతుకుతుందా? లేదా? అనేది మిగిలిన కథ.

నటీనటుల పనితీరు : ఈ చిత్రానికి ఆల్మోస్ట్ ఆల్ రౌండర్ గా వ్యవహరించాడు హీరో ప్రతీక్ ప్రేమ్ కరణ్. అతని గత చిత్రంతో పోలిస్తే ఈ చిత్రంతో నటుడిగా బాగా ఇంప్రూవ్ అయ్యాడు. డ్యాన్స్, ఫైట్స్ తో మాస్ ప్రేక్షకులను కూడా అలరించేలా పెర్ఫార్మ్ చేశాడు. హీరోయిన్ వైష్ణవి పట్వర్ధన్ కూడా బాగా చేసింది.

ముఖ్యంగా ఎమోషనల్ సన్నివేశాల్లో ఆమె నైపుణ్యాన్ని చూపించింది. లుక్స్ పరంగా కూడా ఓకే అనిపించింది. కొన్ని సన్నివేశాల్లో ఈమెని చూస్తే స్టార్ హీరోయిన్ రాశీ ఖన్నా ని చూసిన ఫీలింగ్ కలుగుతుంది. రాజీవ్ కనకాల ఎప్పటిలానే తన మార్క్ పెర్ఫార్మన్స్ తో ఆకట్టుకున్నాడు. ఇక మిగిలిన నటీనటులు తమ తమ పాత్రలకి నాయ్యం చేశారు.

సాంకేతిక నిపుణుల పనితీరు : మళ్ళీ ఇక్కడ ప్రతీక్ ప్రేమ్ కరణ్ గురించి చెప్పుకోవాలి. అతనే దర్శకుడు కాబట్టి.! అతను రాసుకున్న కథ ఆసక్తికరంగా తీర్చిదిద్దడంలో అతను ఫుల్ మర్క్స్ కొట్టేశాడు. ‘గీతాంజలి’ వంటి ఎమోషనల్ లవ్ స్టోరీలు పెద్ద పెద్ద దర్శకులే డీల్ చేయగలరు అనే అభిప్రాయాలను ఇతను తన డైరెక్షన్ స్కిల్స్ తో కొట్టిపారేశాడు అనే చెప్పాలి.

కథలో ఎమోషన్ ను క్యారీ చేయడంలో కానీ స్క్రీన్ ప్లేని ఆసక్తికరంగా నడిపించడంలో కానీ ప్రతీక్ ఎక్కడా తడబడలేదు. అలాగే అతను రాసుకున్న సంభాషణలు కూడా బాగున్నాయి.నిడివి కూడా 2 గంటల 24 నిమిషాలే కావడం ఈ చిత్రానికి మరో ప్లస్ పాయింట్ గా చెప్పుకోవచ్చు. సంగీతం, నేపథ్య సంగీతం రెండు బాగా కుదిరాయి. ఎస్.డీ జాన్ సినిమాటోగ్రఫీ కూడా బాగుంది. నిర్మాణ విలువలు కథకి తగ్గట్టు బాగానే ఉన్నాయి.

విశ్లేషణ: ఓవరాల్ గా ఫీల్ గుడ్ లవ్ స్టోరీలను ఇష్టపడే వారితో పాటు రెగ్యులర్ మూవీ లవర్స్ ను కూడా అలరించే సినిమా ‘సదా నన్ను నడిపే’.

రేటింగ్: 2.75/5

Read Today's Latest Reviews Update. Get Filmy News LIVE Updates on FilmyFocus