Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Reviews » Sahaa Review in Telugu: సహ సినిమా రివ్యూ & రేటింగ్!

Sahaa Review in Telugu: సహ సినిమా రివ్యూ & రేటింగ్!

  • September 4, 2026 / 11:23 AM ISTByPhani Kumar
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp
Sahaa Review in Telugu: సహ సినిమా రివ్యూ & రేటింగ్!

Cast & Crew

  • శివ కుమార్ కాసారం (Hero)
  • శ్వేతా లక్ష్మణ్ (Heroine)
  • వ్రజన పాండ్య తదితరులు (Cast)
  • నిశాంత్ దోటి (Director)
  • తేజ వేల్పుచర్ల (Producer)
  • శేఖర్ చంద్ర (Music)
  • కరుణాకర్ కొట్టేటి (Cinematography)
  • దినేష్ పెద్ది (Editor)
  • Release Date : 4th సెప్టెంబర్ 2026
  • సుమైరా స్టూడియోస్ (Banner)

ఈ వారం ‘సహ’ (Sahaa) అనే చిన్న సినిమా వస్తుంది అనే విషయం చాలా మందికి తెలిసింది. దానికి ప్రధాన కారణం ఆ సినిమా టీజర్, ట్రైలర్ క్రియేట్ చేసిన ఇంపాక్ట్ కాదు. నటీనటులు ప్రమోషన్స్ లో విసిరిన ఛాలెంజ్..ల కారణంగా అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు..! ‘మా సినిమా ఆడ‌క‌పోతే.. అమీర్ పేట్ సెంట‌ర్ లో గుండు కొట్టించుకొంటా’ అంటూ హీరోయిన్, ‘గొప్ప సినిమా తీశాం, ఎంతైనా ఊహించుకొని థియేటర్..కి రండి, వన్ పర్సెంట్ డిజప్పాయింట్ అయినా.. న‌న్ను ఫోన్ చేసి తిట్టండి..’ అని హీరో .. ప్రమోషన్స్ లో ఓ రేంజ్లో కాన్ఫిడెన్స్ వ్యక్తం చేశారు. మరి వారి ‘నమ్మకం నిజమైందా?’ ఈ రివ్యూ ద్వారా తెలుసుకుందాం రండి:

Sahaa Movie Review

Sahaa Movie Review And Rating

కథ: సంజు(Shiva Kumar) ఓ గ‌వ‌ర్న‌మెంటు ఉద్యోగి. రెజిస్ట్రార్ ఆఫీసులో పనిచేస్తుంటాడు. తన గతాన్ని చూపిస్తూ కథ మొదలవుతుంది. ఇక్కడ గతం అంటే.. కేవలం అతని లవ్ లైఫ్ మాత్రమే. అతని కుటుంబ నేపధ్యం వంటివి ఏమీ చూపించరు. చిన్నప్పటి నుండీ స‌హ (Swetha Lakshman) అనే అమ్మాయిని ప్రేమిస్తాడు. ఆమెకి హాల్ టికెట్ తెచ్చిపెట్టడం కోసం తన ఎం సెట్(EAMCET) ప‌రీక్ష‌ని వదులుకుంటాడు.

దీంతో సహా అతని ప్రేమలో పడుతుంది. తర్వాత సహా (Sahaa) ఇంజనీరింగ్ కాలేజీలో జాయిన్ అవుతుంది. ఆమె కోసం ఫేక్ ఐడీ కార్డు చేయించుకుని ఆమె కాలేజీకి వెళ్ళి సహాని కలుస్తుంటాడు సంజు. ఒక రోజు విషయం కాలేజీ ప్రిన్సిపాల్ కి, అలాగే సీనియర్స్ కి తెలిసిపోతుంది. దీంతో సంజుని పోలీసులకి అప్పగించే రేంజ్..కి వెళ్తుంది వ్యవహారం. కానీ సహా అడ్డుకోవడం ఆ తర్వాత ఇద్దరూ రిజిస్టర్ మ్యారేజ్ చేసుకోవడం చక చక జరిగిపోతాయి. తర్వాత సహా గర్భం దాల్చడం, దాని కోసం లాంగ్ లీవ్(ఉద్యోగంలో) తీసుకోవడం జరుగుతుంది. పుట్టింటి వాళ్ళు కూడా సహాకి నెలలు నిండటంతో ఆమెను దగ్గరకు తీసుకుంటారు.

కానీ మరోవైపు అనుకోకుండా సంజు ఉద్యోగం పోతుంది. ఉద్యోగం ఉన్నన్ని రోజులు సహా పుట్టింటి వాళ్ళు అతన్ని మహారాజులా చూస్తారు. కానీ ఉద్యోగం పోయాక.. అతన్ని తక్కువ చేసి చూస్తారు. అది సహాకి నచ్చదు. సంజు సైతం సహాపై ఫ్రస్ట్రేట్ అయ్యి.. ఆమె ఫోన్ కాల్స్ అవాయిడ్ చేస్తూ ఉంటాడు. అలాగే సీరియస్ గా గవర్నమెంట్ ఉద్యోగానికి ప్రిపేర్ అవుతుంటాడు. ఈ క్రమంలో ఓ ఘోరం జరుగుతుంది? ఆ తర్వాత సహా, సంజు జీవితాలు ఎటువంటి మలుపు తీసుకున్నాయి అనేది మిగిలిన కథ.

Sahaa Movie Review And Rating

నటీనటుల పనితీరు: శివ కుమార్ కాసారం బాగా చేశాడు. స్కూల్ పిల్లాడిగా, కాలేజీ స్టూడెంట్ గా, ప్రభుత్వ ఉద్యోగిగా లుక్స్ విషయంలో అతను చూపించిన వేరియేషన్స్ అభినందనీయం. పాత్రకి సరెండర్ అయ్యి బాగానే పెర్ఫార్మ్ చేశాడు. శ్వేతా లక్ష్మణ్ కూడా చాలా బాగుంది. లుక్స్ తో పాటు పెర్ఫార్మన్స్ కూడా బాగా చేసింది. వ్రజన పాండ్య పాత్ర సినిమాని ఎండ్ చేయడం కోసం పనికొచ్చింది అని చెప్పాలి. మిగతా నటీనటుల పాత్రలు అంతగా రిజిస్టర్ కావు.

Sahaa Movie Review And Rating

సాంకేతిక నిపుణుల పనితీరు: ప్రమోషన్స్ లో హీరో, హీరోయిన్లు ఛాలెంజ్లు విసిరిన రేంజ్లో ఈ సినిమా కథ, కథనాలు ఉండవు. అప్పుడెప్పుడో వచ్చిన ‘టెన్త్ క్లాస్’ నుండీ మొన్నామధ్య వచ్చిన వడ్డే నవీన్ ‘నా ఊపిరి’ వరకు చాలా సినిమాల పోలికలు కనిపిస్తాయి. టార్గెటెడ్ ఆడియన్స్ సైతం ఇరిటేట్ అయ్యేలా లాజిక్ లెస్ సన్నివేశాలు ఈ సినిమాలో చాలా ఉంటాయి. కథ, కథనాల్లో టైం పీరియడ్ కనిపించదు.

అది పక్కన పెట్టేస్తే.. ఎం సెట్ పరీక్ష మిస్ అయినంత మాత్రాన హీరోకి డిగ్రీ చదివే ఛాన్స్ ఉండదా? హీరోయిన్ ఇంజినీరింగ్ చదవడానికి వెళితే.. రోజంతా ఆమెతోనే కాలేజీలో ఉంటాడు హీరో. మరీ ఇంత కేర్ లెస్ యువత ఉంటుందా? హీరోయిన్ మంచి స్టూడెంట్ అయినప్పటికీ అతనికి మంచి చెప్పకపోవడం ఏంటో? దర్శకుడికే తెలియాలి. సరే తెలీకుండానే ఇలా పర్సనల్ గా ఇన్వాల్వ్ అయిపోయి తిట్టాలనిపించే సెన్స్ లెస్ సీన్స్ ఇందులో ఉన్నాయి.

సినిమాలో డైలాగులు సహజంగా అనిపిస్తాయి. ఆ విషయంలో దర్శకుడిని మెచ్చుకోవచ్చు. ఎడిటింగ్ కొంత కన్ఫ్యూజ్ చేసింది. స్క్రీన్ ప్లే అలా ఉన్నప్పుడు ఎడిటర్ మాత్రం ఏం చేస్తాడు. నిర్మాణ విలువలు కథకి తగ్గట్టు బాగానే సెట్ అయ్యాయి. క్లైమాక్స్ లో చూపించే యాక్సిడెంట్ ఎపిసోడ్ చాలా రియలిస్టిక్ ఫీల్ ఇచ్చి భయపెడుతుంది. శేఖర్ చంద్ర మ్యూజిక్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. పాటలు వినడానికి బాగున్నాయి. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో సినిమా సోల్ ని బ్రతికించే ప్రయత్నం చేశాడు.

Sahaa Movie Review And Rating

విశ్లేషణ: టీజర్, ట్రైలర్ చూసినప్పుడే ‘సహ’ (Sahaa) కథ, కథనాల పై ఆడియన్స్ కి ఒక క్లారిటీ వచ్చేస్తుంది. అంతకు మించి సినిమాలో సర్ప్రైజింగ్ ఎలిమెంట్స్ ఏమీ ఉండవు. థియేటర్లు ఎక్కువ ఇచ్చినా ఈ సినిమాకి రూ.50 కోట్లు కాదు కదా.. అందులో సగం కలెక్ట్ చేసే కెపాసిటీ కూడా లేదు.

Sahaa Movie Review And Rating

ఫోకస్ పాయింట్: ‘సహ’నం లేకపోతే భరించడం కష్టం

రేటింగ్: 1.5/5

Rating

1.5
Read Today's Latest Reviews Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Nishanth Doti
  • #Sahaa Movie
  • #Shiva Kumar Kasaram
  • #swetha lakshman
  • #Vrajana Pandya

Reviews

The Paradise Review in Telugu: ది ప్యార‌డైజ్‌ సినిమా రివ్యూ & రేటింగ్!

The Paradise Review in Telugu: ది ప్యార‌డైజ్‌ సినిమా రివ్యూ & రేటింగ్!

Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

Mahendragiri Varahi Review in Telugu: ‘మహేంద్రగిరి వారాహి’ సినిమా రివ్యూ & రేటింగ్!

Mahendragiri Varahi Review in Telugu: ‘మహేంద్రగిరి వారాహి’ సినిమా రివ్యూ & రేటింగ్!

Panchanama Review in Telugu: పంచ‌నామా వెబ్‌సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Panchanama Review in Telugu: పంచ‌నామా వెబ్‌సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

related news

Sahaa Review in Telugu: సహ సినిమా రివ్యూ & రేటింగ్!

Sahaa Review in Telugu: సహ సినిమా రివ్యూ & రేటింగ్!

Swetha Lakshman: ఈ ‘గుండు’ కాన్ఫిడెన్స్‌ ఏంటమ్మా తల్లీ.. ఓవర్‌ అనిపించడం లేదూ..

Swetha Lakshman: ఈ ‘గుండు’ కాన్ఫిడెన్స్‌ ఏంటమ్మా తల్లీ.. ఓవర్‌ అనిపించడం లేదూ..

trending news

Tollywood: ఆ స్టార్స్ కి శత్రువులు ఎక్కువట

Tollywood: ఆ స్టార్స్ కి శత్రువులు ఎక్కువట

12 hours ago
Radhika Apte: నా స్టాఫ్ అంతా నా ఇంటిమేట్ సీన్లు చూశారు.. చాలా భయం వేసింది

Radhika Apte: నా స్టాఫ్ అంతా నా ఇంటిమేట్ సీన్లు చూశారు.. చాలా భయం వేసింది

13 hours ago
The Paradise: ‘ది ప్యారడైజ్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

The Paradise: ‘ది ప్యారడైజ్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

16 hours ago
The Paradise Review in Telugu: ది ప్యార‌డైజ్‌ సినిమా రివ్యూ & రేటింగ్!

The Paradise Review in Telugu: ది ప్యార‌డైజ్‌ సినిమా రివ్యూ & రేటింగ్!

21 hours ago
15 Years For Dookudu: ‘దూకుడు’కి 15 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

15 Years For Dookudu: ‘దూకుడు’కి 15 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

1 day ago

latest news

Nadigar Sangam: నడిగర్‌ సంఘం వ్యవహారం.. రాష్ట్ర ప్రభుత్వాన్ని అడిగిన హైకోర్టు.. ఏమైందంటే?

Nadigar Sangam: నడిగర్‌ సంఘం వ్యవహారం.. రాష్ట్ర ప్రభుత్వాన్ని అడిగిన హైకోర్టు.. ఏమైందంటే?

15 hours ago
Pavithra Gowda: బెయిలివ్వండి.. చనిపోయే అవకాశమైనా ఇవ్వండి: నటి రిక్వెస్ట్‌

Pavithra Gowda: బెయిలివ్వండి.. చనిపోయే అవకాశమైనా ఇవ్వండి: నటి రిక్వెస్ట్‌

15 hours ago
Raghava Lawrence: ఎనిమిది సినిమాలను లైన్‌లో పెట్టేసిన లారెన్స్‌.. ఆ ప్రాజెక్టులేంటో తెలుసా?

Raghava Lawrence: ఎనిమిది సినిమాలను లైన్‌లో పెట్టేసిన లారెన్స్‌.. ఆ ప్రాజెక్టులేంటో తెలుసా?

17 hours ago
Drishtya Kuttakkar: భారీ విజయం సాధించిన మరో మలయాళ సినిమా.. ఏంటా సినిమా? ఏంటా కథ?

Drishtya Kuttakkar: భారీ విజయం సాధించిన మరో మలయాళ సినిమా.. ఏంటా సినిమా? ఏంటా కథ?

18 hours ago
The Paradise Twitter Review: ది ప్యారడైజ్ ట్విట్టర్ రివ్యూ: నాని ఖాతాలో మాస్ హిట్ పడినట్టేనా?

The Paradise Twitter Review: ది ప్యారడైజ్ ట్విట్టర్ రివ్యూ: నాని ఖాతాలో మాస్ హిట్ పడినట్టేనా?

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version