మా తమ్ముడికి కూడా ఆ అవకాశం వచ్చేసింది

చాలా రోజుల తర్వాత ఓ తెలుగు సినిమా, అందులోనూ ఫేమ్‌ ఉన్న హీరో సినిమా థియేటర్లలోకి వచ్చింది. అదేనండి మన సాయితేజ్‌ ‘సోలో బతుకే సో బెటర్‌’. ఇప్పుడు సాయితేజ్‌ను నీ కోరిక ఏంటో చెప్పు అని అడిగితే ‘మా సినిమా మంచి విజయం అందుకోవాలి. మొత్తం ఇండస్ట్రీకి కావాల్సినంత నమ్మకం కలిగించాలి’ అని చెబుతాడు. అయితే లైఫ్‌టైమ్‌లో ఏదైనా కోరిక ఉందా అని అడిగితే ఓ మాట చెబుతాడు. ఇప్పటికే చెప్పేశాడు అనుకోండి. అదే తన పెద్ద మావయ్యతో నటించడం.

మెగా ఫ్యామిలీలో చిరంజీవితో స్క్రీన్‌ స్పేస్‌ షేర్‌ చేసుకునే అదృష్టం అందరికీ దక్కింది. ఆఖరికి ఇంకా హీరోగా తెరంగేట్రం చేయని వైష్ణవ్‌ తేజ్‌ కూడా ‘శంకర్‌ దాదా ఎంబీబీఎస్‌’లో నటించేశాడు. కానీ సాయి తేజ్‌కు మాత్రం ఇంకా ఆ అవకాశం రాలేదు. ఇటీవల కాలంలో చిరంజీవి సినిమాలో సాయితేజ్‌ నటిస్తున్నాడనే వార్తలొచ్చాయి. అయితే దీనిపై ఎవరూ స్పందించలేదు. దీంతో రూమర్‌గానే మిగిలిపోయింది. ఇదే విషయం సాయితేజ్‌ దగ్గర ప్రస్తావిస్తే అసలు విషయం చెప్పాడు.

‘‘పెద్ద మామయ్య నటించాలని ఎప్పటి నుండో కోరికగా ఉంది. అయితే సరైన అవకాశం రావడం లేదు. ఎప్పుడు పిలుపు వస్తే అప్పుడు వెళ్లి చేసి వచ్చేస్తాను’’ అని తన మనసులో మాట చెప్పాడు సాయితేజ్‌. చూద్దాం ఈ మధ్య చిరంజీవి వరుసగా సినిమాలు ఒప్పేసుకుంటున్నాడు. ఎందులోనైనా సాయి తేజ్‌కు చిన్న పాత్ర అయినా ఇస్తాడేమో.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus