Sai Dharam Tej: ఆ స్టార్ డైరెక్టర్ వద్దు అని చెప్పినా సరే ఆ రెండు ప్లాప్ సినిమాల్లో నటించిన తేజ్..!

కొన్ని సార్లు మొహమాటానికి పోయి హీరోలు సినిమాలు చేస్తుంటారు. మరికొన్ని సార్లు గుడ్డిగా నమ్మేసి సినిమాలు చేస్తుంటారు. అయితే ఓ హీరో మాత్రం ఇచ్చిన మాటకి కట్టుబడి.. ప్లాప్ అవుతుందని తెలిసినా సినిమాలు చేసాడట. అతను మరెవరో కాదు మన మెగా మేనల్లుడు సాయి తేజ్. విషయంలోకి వెళ్తే.. ‘పిల్లా నువ్వు లేని జీవితం’ ‘సుబ్రహ్మణ్యం ఫర్ సేల్’ ‘సుప్రీమ్’ వంటి చిత్రాలతో వరుస హిట్లు కొట్టి.. ఫామ్లో ఉన్న సాయి తేజ్…

ఆ టైంలో ఇంకో హిట్టు పడితే స్టార్ హీరోల లిస్ట్ లో చేరిపోయేవాడు. కానీ తన మొదటి సినిమా ‘రేయ్’ టైంలోనే కొంతమంది దర్శకులకి సినిమా చేస్తానని మాటిచ్చాడట. అందుకే కెరీర్ పీక్స్ లో ఉన్న టైంలో రిస్క్ అని తెలిసినా ఇద్దరు దర్శకులతో సినిమా చెయ్యడానికి రెడీ అని చెప్పాడట. అలా చేసిన సినిమాలే ‘జవాన్’ ‘నక్షత్రం’ అని తెలుస్తుంది. బి.వి.యస్ రవికి కానీ కృష్ణవంశీకి కానీ ఆ టైములో హిట్లు లేవు. ఇంకా కృష్ణవంశీకి మధ్యలో ‘గోవిందుడు అందరివాడేలే’ చేసే అవకాశం అయినా లభించింది.

కానీ ‘జవాన్’ చేసేప్పుడు.. టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ ఒకాయన తేజుని హెచ్చరించారట. అయినప్పటికీ ‘ఆ సినిమాలు ప్లాప్ అని తెలుసు.. కానీ మాటిచ్చేసాను. ఇప్పుడు ఆ మాట కాదని తప్పుకుంటే నేను నిద్రపోలేను’ అంటూ ఆ నిర్మాతకి బదులిచ్చాడట మన తేజు.ఇక వినాయక చవితి రోజునాడు యాక్సిడెంట్ పాలైన తేజు త్వరగానే కోలుకున్నాడు. ‘రిపబ్లిక్’ ప్లాప్ అయినా వరుస సినిమాలతో ప్రేక్షకుల్ని అలరించడానికి రెడీ అవుతున్నాడు.

పుష్పక విమానం సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

ప్రకటనలతోనే ఆగిపోయిన మహేష్ బాబు సినిమాలు ఇవే..!
రాజా విక్రమార్క సినిమా రివ్యూ & రేటింగ్!
3 రోజెస్ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus