మెగా మేనల్లుడుతో మంచు మనోజ్ ఫోటో వెనుక ఉన్న కథ..!

మోహన్ బాబుగారి చిన్న కొడుకు మంచు మనోజ్ పలు హిట్ సినిమాల్లో నటించి మంచి క్రేజ్ సంపాదించుకున్నాడు. అయితే మధ్యలో తన పర్సనల్ లైఫ్ డిస్టర్బ్ అవ్వడంతో సినిమాలకు దూరంగా ఉంటూ వచ్చాడు. ఇక ఇప్పుడు వరుసగా సినిమాలు చెయ్యడానికి రెడీ అయిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉండగా.. ఇతను మంచి చమత్కారి అన్న సంగతి నెటిజన్లందరికీ తెలుసు.తోటి హీరోలతో అతను ఎంతో స్నేహంగా ఉంటూ ఉంటాడు. ఎన్టీఆర్ తో ఎంత స్నేహంగా ఉంటాడో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు.

ఇక మెగా ఫ్యామిలీ హీరోలందరితో కూడా అంతే స్నేహంగా ఉంటుంటాడు. తాను నటించబోయే ‘అహం బ్రహ్మాస్మి’ చిత్రం ఓపెనింగ్ కు మనోజ్.. చరణ్ ను ముఖ్య అతిధిగా ఆహ్వానించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు మెగా మేనల్లుడు అయిన సాయి తేజ్ ను వియ్యంకుడు అంటూ పరిచయం చేసి అందరినీ ఆశ్చర్యపరిచాడు. విషయం ఏంటంటే.. మంచు మనోజ్ కు తన పెంపుడు కుక్క అంటే చాలా ఇష్టం. ఇదే విషయాన్ని పలు సందర్భాల్లో కూడా చెప్పుకొచ్చాడు.

అయితే తాజాగా తన పెంపుడు కుక్కకి.. సాయి తేజ్ పెంపుడు కుక్కతో డేటింగ్ ఎరేంజ్ చేసాడు. “టాంగో, జోయాలకు ఇది డేటింగ్ రోజు. సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేసాం. నాకు మంచి అల్లుడ్ని ఇస్తున్నందుకు నా వియ్యంకుడు సాయి తేజ్ కు థ్యాంక్స్. త్వరలోనే ముహుర్తాలు పెట్టించి శుభలేఖలు వేయిస్తాం” అంటూ తన దైన శైలిలో చెప్పుకొచ్చాడు మనోజ్. వారి పెంపుడు కుక్కలతో తీసుకున్న ఫోటోని కూడా మంచు మనోజ్ తన సోషల్ మీడియాలో పోస్ట్ చేసాడు. ఇప్పుడు ఈ పిక్ వైరల్ అవుతుంది.

Most Recommended Video

కృష్ణ అండ్ హిజ్ లీల సినిమా రివ్యూ & రేటింగ్
పెంగ్విన్ సినిమా రివ్యూ & రేటింగ్!
టాలీవుడ్ లో అత్యధిక నష్టాలు మిగిల్చిన పది చిత్రాలు ఇవే

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus