Sai Dharam Tej: అదే నాకు పెద్ద సక్సెస్: సాయి ధరమ్ తేజ్

మెగా కాంపౌండ్ నుంచి హీరోగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి వారిలో నటుడు సాయిధరమ్ తేజ్ ఒకరు. హీరోగా ఈయన ఇండస్ట్రీలో ఎన్నో సినిమాలలో నటించి మంచి సక్సెస్ అందుకున్నారు. అయితే గత మూడు సంవత్సరాల క్రితం సాయిధరమ్ తేజ్ రోడ్డు ప్రమాదానికి గురైన సంగతి మనకు తెలిసిందే.

ఇలా ఈయన ప్రమాదానికి గురి కావడంతో కోమాలోకి వెళ్లిపోయారు. అనంతరం ఈయన ఈ ప్రమాదం నుంచి కోలుకున్నప్పటికీ కొద్ది రోజులపాటు ఇండస్ట్రీకి దూరంగా ఉంటూ విరూపాక్ష సినిమా షూటింగ్లో భాగమయ్యారు. అయితే ఇటీవల సాయి ధరమ్ తేజ్ రౌండ్ టేబుల్ ఇంటరాక్షన్‌లో పాల్గొన్నాడు. తరుణ్ భాస్కర్, శ్రుతి హాసన్, సాయి ధరమ్ తేజ్, శ్రియా రెడ్డి, శోభు యార్లగడ్డ ఇలా అందరూ కలిసి ముచ్చటించారు. మీడియా ప్రతినిధి అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పారు.

ఇక సినిమా గురించి ప్రతి ఒక్కరూ కూడా వారి అభిప్రాయాలను తెలియజేశారు. అయితే సాయి ధరమ్ తేజ్ ను గమనిస్తే ఆయన వాయిస్ కొంచెం చేంజ్ అయినట్టు కనిపిస్తుంది. గొంతు మీదున్న ఆ గాయం తాలుకా గుర్తు కనిపిస్తుంది. అంటే తేజ్ ఇంకా ఆ గాయంతో బాధపడుతున్నాడనిపిస్తోంది. ఇక సాయిధరమ్ తేజ్ మాట్లాడుతూ తనకు విరూపాక్ష సినిమా చేసే సమయంలో కాస్త కష్టం అనిపించిందని తెలిపారు. అయితే ఈ సినిమా సక్సెస్ అయినందుకు తనకు సంతోషం లేదని తెలిపారు.

ఈ సినిమా సక్సెస్ కంటే నేను హాస్పిటల్ నుంచి ఇంటికి వచ్చిన తర్వాత అలాగే హాస్పిటల్ బెడ్ పై ఉన్నప్పుడు నేను త్వరగా కోలుకోవాలని తనని పరామర్శించడానికి వచ్చిన వారందరినీ చూసి చాలా సంతోషం వేసిందని తెలిపారు. ఒక నటుడుగా ఇంతమంది అభిమానులను సంపాదించుకున్నాను అంటే అంతకంటే మరొక సక్సెస్ ఏముంటుంది అంటూ ఈ సందర్భంగా ఈయన చేసినటువంటి వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.

ఈ ఏడాది ప్రేక్షకుల్ని ఆకట్టుకున్న తెలుగు సినిమాలు!

ఈ ఏడాది వచ్చిన 10 రీమేక్ సినిమాలు… ఎన్ని హిట్టు.. ఎన్ని ఫ్లాప్?
ఈ ఏడాది ప్రేక్షకులు తలపట్టుకొనేలా చేసిన తెలుగు సినిమాలు!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus