బాలీవుడ్ లో నెపోటిజం ఉందంటూ ఇప్పటికే చాలా మంది స్టార్లు మీడియా ముందుకొచ్చి చెప్పారు. స్టార్ల వారసులకు వచ్చే అవకాశాలు బయట నుండి వచ్చే నటీనటులకు ఉండవంటూ ఆవేదన వ్యక్తం చేశారు. బాలీవుడ్ సంగతి పక్కన పెడితే టాలీవుడ్ లో మాత్రం నెపోటిజం అనే పదానికి తావులేదని చెబుతున్నాడు మెగాహీరో సాయి ధరమ్ తేజ్. మెగా కాంపౌండ్ నుండి వస్తే చాలు.. అవకాశాలు క్యూ కడతాయని.. సక్సెస్-ఫెయిల్యూర్ లాంటి బాధలు అక్కర్లేదని చాలా మంది అనుకుంటారని కానీ అలాంటి ఛాన్స్ లేదని అంటున్నాడు ధరమ్ తేజ్.
నిజంగా మెగా కాంపౌండ్ సపోర్ట్ ఉంటే తన తొలి సినిమా రిలీజ్ కావడానికి ఐదేళ్లు పట్టదని చెబుతున్నాడు. మెగా ఫ్యామిలీ అనే ట్యాగ్ లైన్ మొదటి రెండు సినిమాలకు కలిసి రావొచ్చని.. అంతకుమించి ఇంకేం ఉందని అన్నారు. మన హార్డ్ వర్క్, టాలెంట్ మాత్రమే పని చేస్తుందని.. టాలీవుడ్ లో నెపోటిజం లేదని అన్నారు. నిజంగానే నెపోటిజం ఉండి ఉంటే తన మొదటి సినిమా రిలీజ్ కావడానికి ఐదేళ్లు పట్టేది కాదు కదా అని అన్నాడు. చిరంజీవి తన మేనమామ కాబట్టి వెంటనే సినిమా రిలీజ్ అయిపోవాలి కదా.. కానీ ఐదేళ్లు ఎందుకు పట్టిందని ప్రశ్నించాడు.
మరోపక్క తను ఇంకా స్టార్ హీరో రేంజ్ కి ఎదగలేకపోయాననే కామెంట్స్ పై స్పందిస్తూ.. ఇంకా చాలా టైమ్ ఉందని.. తొందరపడకుండా మంచి సినిమాలు చేస్తున్నానని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈ హీరో నటించిన ‘సోలో బ్రతుకే సో బెటర్’ సినిమా రిలీజ్ కి సిద్ధంగా ఉంది. మరి ఈ సినిమాను ఓటీటీలో రిలీజ్ చేస్తారో లేక థియేటర్లలో రిలీజ్ చేస్తారో చూడాలి!
Most Recommended Video
కలర్ ఫోటో సినిమా రివ్యూ & రేటింగ్!
24 గంటల్లో అత్యధిక లైక్స్ ను సాధించిన టాప్ 20 టీజర్లు ఇవే..!
టాలీవుడ్ లో తెరకెక్కిన హాలీవుడ్ చిత్రాలు!