సాయి ధరమ్ తేజ్ ప్లాన్ మామూలుగా లేదుగా!!
- April 14, 2017 / 10:54 AM ISTByFilmy Focus
నటన, డ్యాన్సులతో సాయిధరమ్ తేజ్ మెగా హీరో అనిపించుకున్నాడు.. పిల్ల నువ్వు లేని జీవితం, సుబ్రహ్మణ్యం ఫర్ సేల్, సుప్రీమ్ వంటి సినిమాల్లో మామయ్యలు ఇమిటేట్ చేస్తూ బాగానే అభిమానులను సొంతం చేసుకున్నాడు. తిక్కతో బోల్తా కొట్టిన తేజు విన్నర్ మూవీతో కొంత కోలుకున్నాడు. ఇప్పుడు కృష్ణవంశీ మూవీ నక్షత్రంలో పోలీస్ గా అలరించడానికి రెడీ అవుతున్నాడు. పవన్ కళ్యాణ్ ని ఇమిటేట్ చేస్తూ పాపులర్ కావడం కాదు.. అయన సినిమాలో కాసేపు కనిపిస్తే తన రేంజ్ పెరిగిపోతుందని సాయి ధరమ్ కి తాజాగా ఐడియా వచ్చిందంట. ఆలా ఆలోచన రాగానే దాన్ని అమలు చేసే పనిలో బిజీగా ఉన్నాడని ఫిలిం నగర్ వాసులు చెప్పుకుంటున్నారు.
ప్రస్తుతం పవన్ కళ్యాణ్ మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో నటిస్తున్నారు. హారిక అండ్ హాసిని బ్యానర్లో కె రాధాకృష్ణ నిర్మిస్తున్న ఈ మూవీ రామోజీ ఫిలిం సిటీలో షూటింగ్ జరుపుకుంటోంది. ఇందులో చిన్న పాత్రలోనైనా కనిపించాలని త్రివిక్రమ్ ని సాయి ధరమ్ తేజ్ అడిగాడని తెలిసింది. రెండు రోజుల క్రితం షూటింగ్ స్పాట్ కి పోయి పవన్ తో కూడా చెప్పించినట్లు సమాచారం. అందుకు త్రివిక్రమ్ ఒకే అన్నారని, సాయి కోసం కొత్తగా క్యారక్టర్ ని డిజైన్ చేయాలా? రాసుకున్న దానిలోనే నటింపజేయించాలా అనే ఆలోచనలో డైరక్టర్ ఉన్నట్లు టాక్. మొత్తానికి పవన్ క్రేజ్ ని సొంతం చేసుకోవడానికి తేజు మంచి ప్లాన్ వేసాడుగా.
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.
















