సాయి తేజ్ అసలు ఆ సినిమానే చూడలేదట..!

ఇటీవల విడుదలయ్యి సూపర్ హిట్ గా నిలిచిన రణ్ వీర్ సింగ్, అలియా భట్ ల బాలీవుడ్ చిత్రం ‘గల్లీబాయ్’. జోయా అక్తర్ డైరెక్షన్లో తెరకెక్కిన ఈ చిత్రం బాలీవుడ్లో భారీ వసూళ్లను నమోదుచేసింది. దీంతో ఈ చిత్రాన్నితెలుగులో రీమేక్ చేయబోతున్నారంటూ వార్తలొచ్చాయి. ఈ చిత్ర రీమేక్ హక్కుల్ని ‘గీతా ఆర్ట్స్’ అధినేత అల్లు అరవింద్ కొనుగోలు చేసారని… విజయ్ దేవరకొండ హీరోగా ఈ రీమేక్ ఉండబోతుందని టాక్ నడిచింది. విజయ్ కి వరుస కమిట్మెంట్స్ తో బిజీగా ఉండడంతో… సాయిధరమ్ తేజ్ పేరు వచ్చి చేరింది.

సరైన సక్సెస్ కోసం చాలా కాలంగా ఎదురుచూస్తున్న తేజు అయితే ఈ రీమేక్ కు కరెక్ట్ అని అప్పట్లో వార్తలొచ్చాయి. తాజాగా ఈ వార్తల పై సాయి తేజ్ క్లారిటీ ఇచ్చాడు. ఈ విషయం పై తేజు మాట్లాడుతూ…”అసలు ఇప్పటివరకూ నేను ‘గల్లీబాయ్’ సినిమా చూడనేలేదు. అలాంటిది ఈ సినిమా రీమేక్ లో ఎలా చేస్తాను? .. ఇదంతా కేవలం పుకారు మాత్రమే” అంటూ చెప్పుకొచ్చాడు. దీంతో తేజు కూడా ఈ రీమేక్ లో నటించడం లేదని స్పష్టమవుతుంది. మరి అల్లు అరవింద్ ఎవరికోసం ఈ రైట్స్ ను తీసుకున్నట్టు అనేది చర్చనీయాంశం అయ్యింది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus