సాయితేజ్‌, న‌భా న‌టేశ్ జంట‌గా న‌టిస్తోన్న చిత్రం `సోలో బ్ర‌తుకే సో బెట‌ర్‌`

సాయితేజ్‌, న‌భా న‌టేశ్ జంట‌గా న‌టిస్తోన్న చిత్రానికి `సోలో బ్ర‌తుకే సో బెట‌ర్‌` అనే టైటిల్‌ను ఖ‌రారు చేశారు. సుబ్బు ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం అవుతున్న ఈ చిత్రాన్ని శ్రీ వెంక‌టేశ్వ‌ర సినీ చిత్ర ఎల్‌.ఎల్‌.పి బ్యాన‌ర్‌పై బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్నారు. విజ‌య‌ద‌శ‌మి సంద‌ర్భంగా సోమవారం ఈ సినిమా పూజా కార్య‌క్ర‌మాలు హైద‌రాబాద్‌లో జ‌రిగాయి. టైటిల్ లుక్ పోస్ట‌ర్‌ను విడుద‌ల చేశారు.

నవంబ‌ర్ నుండి రెగ్యుల‌ర్ షూటింగ్ ప్రారంభం అవుతుంది. 2020 వేస‌విలో విడుద‌ల చేసేలా ప్లాన్ చేశారు. త‌మ‌న్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి వెంక‌ట్ సి.దిలీప్ సినిమాటోగ్ర‌ఫీ అందిస్తున్నారు.

సైరా నరసింహారెడ్డి చిత్రంలోని పవర్ ఫుల్ డైలాగ్స్
సైరా సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus