Sai Tej: ఆ సినిమా మెగా హీరో సాయితేజ్ కెరీర్ ను డిసైడ్ చేయనుందా?

  • May 24, 2024 / 11:48 AM IST

ప్రస్తుతం తెలుగు సినిమాలకు సంబంధించి పెద్ద హీరోలు, చిన్న హీరోలు, మిడిల్ రేంజ్ హీరోలు అని ప్రేక్షకులు పట్టించుకోవడం లేదు. కేవలం కంటెంట్ అద్భుతంగా ఉన్న సినిమాలు, కంటెంట్ ఆసక్తిగా లేని సినిమాలు అనే చర్చ మాత్రమే ప్రేక్షకుల మధ్య ఉంది. యంగ్ హీరో సాయితేజ్ (Sai Dharam Tej) కొత్త సినిమా ఏకంగా 100 కోట్ల రూపాయల బడ్జెట్ తో తెరకెక్కుతోందని సమాచారం అందుతోంది. హనుమాన్ నిర్మాత నిర్మాణంలో ఈ సినిమా తెరకెక్కనుంది.

నిర్మాత నిరంజన్ రెడ్డి నెక్స్ట్ లెవెల్ లో ఈ సినిమాను ప్లాన్ చేస్తున్నారని తెలుస్తోంది. హీరో సాయితేజ్ విరూపాక్ష (Virupaksha) సినిమాతో 100 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్లను సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే 100 కోట్ల రూపాయల బడ్జెట్ అంటే ఒక విధంగా రిస్క్ అని చాలామంది భావిస్తారు. ప్రస్తుతం డిజిటల్, శాటిలైట్ రైట్స్ డీల్స్ ఆశించిన స్థాయిలో జరగడం లేదని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది.

ఈ సినిమా ఒక విధంగా మెగా హీరో కెరీర్ ను డిసైడ్ చేయనుందని కామెంట్లు వినిపిస్తున్నాయి. యంగ్ హీరో సాయితేజ్ సైతం కథల ఎంపికలో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నారని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. రోహిత్ అనే కొత్త డైరెక్టర్ డైరెక్షన్ లో ఈ సినిమా తెరకెక్కనుందని జూన్ నెలలో ఈ సినిమా పూజా కార్యక్రమాలు మొదలు కానున్నాయని భోగట్టా. ఈ సినిమాలో యాక్షన్ సీన్స్ సైతం సరికొత్తగా ఉంటాయని సినిమాలో పొలిటికల్ అంశాలను టచ్ చేస్తారని తెలుస్తోంది.

హనుమాన్ తో (Hanu Man) బాక్సాఫీస్ ను షేక్ చేసిన నిరంజన్ రెడ్డి తర్వాత ప్రాజెక్ట్ లతో మ్యాజిక్ చేస్తానని బలంగా నమ్ముతున్నారు. కంటెంట్ అద్భుతంగా ఉంటే భారీ స్థాయిలో ఖర్చు చేయడానికి ఆయన వెనుకాడటం లేదు. సాయితేజ్ సైతం విరూపాక్ష సక్సెస్ తర్వాత కథ, కథనం విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నారని సమాచారం అందుతోంది.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus