2019 అసెంబ్లీ ఎన్నికల్లో.. పోటీ చేసిన రెండు చోట్లా ఓడిపోయాడు పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) . ఆ టైంలో ప్రత్యర్ధులు పండగ చేసుకున్నారు. పవన్ కళ్యాణ్ వెంటే ఉన్నవాళ్లు సైతం.. ‘2024 ఎన్నికల వరకు అంటే.. 5 ఏళ్ళ పాటు పవన్ కళ్యాణ్ పార్టీని నడపగలడా?’ అని ఆందోళన చెందారు. కానీ పవన్ కళ్యాణ్ ఎంత మొండోడో.. రాను రాను అందరికీ అర్ధమయ్యింది. 5 ఏళ్ళ పాటు పార్టీని నిలబెట్టడమే కాకుండా.. 2024 ఎన్నికల్లో గేమ్ ఛేంజర్ గా నిలిచాడు పవన్ కళ్యాణ్.
21 స్థానాల్లో పోటీ చేసిన జనసేన 20 స్థానాలు వరకు గెలిచే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. అయితే ఎన్నికల ప్రచారంలో భాగంగా పవన్ కళ్యాణ్.. వైసీపీ పార్టీ నేతలకి, ముఖ్యంగా ముఖ్యమంత్రి జగన్ కి ఓ రేంజ్లో వార్నింగ్ ఇచ్చాడు. దాన్ని జగన్ పార్టీ చాలా తేలిగ్గా తీసుకుంది. కట్ చేస్తే ఇప్పుడు వైసీపీ పార్టీ ప్రతిపక్షంలో కూడా నిలిచే అవకాశాలు కనిపించడం లేదు. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ భారీ మెజారిటీతో గెలవడం ఖాయంగా కనిపిస్తుంది.
ఈ సందర్భంగా మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ (Sai Dharam Tej) .. సారి సారి సాయి దుర్గా తేజ్ ఓ ఆసక్తికర ట్వీట్ వేశాడు. ‘గుర్తు పెట్టుకో జగన్… నిన్నూ నీ పార్టీనీ భూస్థాపితం చేయకపోతే నా పేరు పవన్ కల్యాణే కాదు, నాది జనసేన పార్టీనే కాదు’ అంటూ పవన్ కళ్యాణ్.. జగన్ కు సవాల్ విసిరినా వీడియోని షేర్ చేస్తూ.. ‘చెప్పాడు.. చేశాడు..మనల్ని ఎవడ్రా ఆపేది’ అంటూ రాసుకొచ్చాడు. ప్రస్తుతం ఈ ట్వీట్ వైరల్ గా మారింది.
చెప్పాడు… చేసాడు.
మనల్ని ఎవడ్రా ఆపేది!!!
pic.twitter.com/UN57aR0hD4— Sai Dharam Tej (@IamSaiDharamTej) June 4, 2024