Sai Dharam Tej: బ్రో సినిమా చేయడంతో పెళ్లి పై హోప్స్ అసలు లేవు: సాయి ధరమ్ తేజ్

Ad not loaded.

మెగా హీరో సాయి ధరమ్ తేజ్ విరూపాక్ష సినిమా ద్వారా రీ ఎంట్రీ ఇచ్చి మంచి సక్సెస్ అందుకున్నారు. ఇలా ఈ సినిమాతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి ఈయన త్వరలోనే బ్రో సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమయ్యారు. సముద్రఖని దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ సాయి ధరంతేజ్ మల్టీస్టారర్ గా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నటువంటి ఈ సినిమా జూలై 28వ తేదీ విడుదలకు సిద్ధమవుతుంది. ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడుతున్నటువంటి నేపథ్యంలో పెద్ద ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.

అయితే పవన్ కళ్యాణ్ ప్రస్తుతం రాజకీయ పనులలో బిజీగా ఉన్న నేపథ్యంలో సాయిధరమ్ తేజ్ ఈ సినిమా ప్రమోషన్ భారాన్ని మొత్తం తనపై వేసుకొని వరుస ఇంటర్వ్యూలకు హాజరవుతూ సినిమాపై భారీ అంచనాలు పెంచేలా చేస్తున్నారు. ఈ క్రమంలోనే సాయి ధరమ్ తేజ్ తాజాగా యాంకర్ సుమతో కలిసి ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ ఇంటర్వ్యూ సందర్భంగా సుమ సాయిధరమ్ తేజ్ పెళ్లి గురించి ప్రశ్నించారు. ఈ ప్రశ్నకు సాయిధరమ్ తేజ్ సమాధానం చెబుతూ..

నాకు విరూపాక్ష సినిమా చేసిన సమయంలో పెళ్లి గురించి కొన్ని హోప్స్ వచ్చాయి పెళ్లి చేసుకోవాలని ఆలోచనలు కూడా వచ్చాయి కానీ బ్రో సినిమా చేసిన తర్వాత ఆ హోప్స్ కాస్త లేకుండా పోయాయని తెలిపారు. తాను నటించిన బ్రో సినిమా విడుదలవుతున్నటువంటి నేపథ్యంలో ప్రతి ఒక్కరు తనని బ్రో అని పిలుస్తున్నారని అందుకే నాకు పెళ్లి పై పూర్తిగా హోప్స్ తగ్గిపోయాయి అంటూ సరదాగా సాయి ధరమ్ తేజ్ (Sai Dharam Tej) చేసినటువంటి ఈ కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.

ఇక ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ మొదటి 15 నిమిషాలు మాత్రమే కనిపించరని ఆ తర్వాత చివరి వరకు పవన్ కళ్యాణ్ సాయి తేజ్ తో కలిసి కనిపిస్తారని తెలుస్తుంది. ఇందులో ఈయన దేవుడి తరహా పాత్రలో నటించబోతున్నట్లు సమాచారం.

పాత్ర కోసం ఇష్టాలను పక్కన పడేసిన నటులు వీళ్లేనా..!

సీరియల్ హీరోయిన్స్ రెమ్యూనరేషన్ తెలిస్తే మతిపోతోంది !
ఈ వారం థియేటర్/ ఓటీటీల్లో సందడి చేయబోతున్న 19 సినిమాలు/ సిరీస్ లు

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus