Sai Dharam Tej, Allu Arjun: బన్నీ ఫ్యాన్స్ కి ఊహించని షాక్ ఇచ్చిన సాయి ధరమ్ తేజ్..!

  • June 12, 2024 / 05:42 PM IST

సాయి ధరమ్ తేజ్ (Sai Dharam Tej) .. కల్మషం లేని మనిషి. చాలా కూల్ అండ్ కంపోజ్డ్ గా వ్యవహరిస్తాడు. అందుకే అతన్ని లాయల్ గా అభిమానించే వాళ్ళు ఎక్కువ. ఇంకా చెప్పాలంటే మెగా ఫ్యామిలీలో పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) తర్వాత అంత పాజిటివ్ పర్సన్ ఇతనే అని జనాలు భావిస్తూ ఉంటారు. ‘అలాంటి వ్యక్తి ఇప్పుడు సహనం కోల్పోయాడా?’ అంటే అవుననే సమాధానాలు ఎక్కువగా వినిపిస్తున్నాయి. ఎందుకో ఈ పాటికే అందరికీ అర్ధమైపోయుండొచ్చు. ఆంధ్రప్రదేశ్ లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల టైంలో జనసేన తరఫున మెగా ఫ్యామిలీ మెంబర్స్ అంతా ప్రచారంలోకి దిగారు.

కానీ అల్లు అర్జున్ (Allu Arjun) మాత్రం వ్యూహాత్మకంగా వ్యవహరించాడు. పవన్ కళ్యాణ్ కోసం ఒక ట్వీట్ వేసి.. ఆ తర్వాత నంద్యాల నుండి పోటీ చేసిన వైసీపీ అభ్యర్థి తరఫున ప్రచారం చేసి వచ్చాడు. ఇది మెగా అభిమానులకు మాత్రమే కాదు.. మెగా ఫ్యామిలీ మెంబర్స్ కి కూడా నచ్చలేదు. దీంతో ఎన్నికల అనంతరం నాగబాబు (Naga Babu) పరోక్షంగా అల్లు అర్జున్ పై ఓ ట్వీట్ వేసి తన కడుపు మంట చాటుకున్న సంగతి తెలిసిందే. దీనిపై ఎంత రచ్చ జరిగిందో అందరికీ తెలుసు.

అయితే ఇప్పుడు సాయి ధరమ్ తేజ్ కూడా అల్లు అర్జున్ ని తన ట్విట్టర్, ఇన్స్టా గ్రామ్ అకౌంట్స్ లో అన్ ఫాలో కొట్టి పెద్ద చర్చకు తెరలేపాడు. ఈ టాపిక్ ఇప్పుడు వైరల్ గా మారింది. అల్లు అర్జున్ ఫ్యాన్స్ కొంతమంది సాయి ధరమ్ తేజ్ పై మండిపడుతూ కామెంట్స్ చేస్తుంటే.. మరోపక్క కొంతమంది మెగా అభిమానులు మాత్రం ‘సాయి ధరమ్ తేజ్ చేసిన దాంట్లో తప్పేమీ లేదు’ అంటూ వెనకేసుకొస్తున్నారు.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus