సీఎంతో మెగా మేనల్లుడి గొడవ!

మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ ఇటీవల ‘సోలో బ్రతుకే సో బెటర్’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ప్రస్తుతం ఈ హీరో ;రిపబ్లిక్’ అనే సినిమాలో నటిస్తున్నాడు. దర్శకుడు దేవకట్టా రూపొందిస్తోన్న ఈ సినిమాకి సంబంధించి ఓ వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ సినిమాను పొలిటికల్ నేపథ్యంలో రూపొందిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో సాయి ధరమ్ తేజ్ జిల్లా కలెక్టర్ పాత్ర పోషిస్తున్నాడు. తాజాగా అందుతోన్న సమాచారం ప్రకారం..

ఈ సినిమా ఏలూరు సమీపంలో ఉండే కొల్లేరు సరస్సుకు సంబంధించిన వివాదాస్పద కాన్సెప్ట్ తో సాగుతుందని తెలుస్తోంది. కలెక్టర్ గా పనిచేస్తోన్న సాయి ధరమ్ తేజ్ ఈ అంశంపై పోరాటం చేస్తారని సమాచారం. కొల్లేరు సరస్సు పూర్వ వైభవం కోసం ఏకంగా ముఖ్యమంత్రితో ఫైట్ చేస్తాడట హీరో. ఈ సినిమాలో సీఎం పాత్రలో సీనియర్ హీరోయిన్ రమ్యకృష్ణ నటిస్తోంది. వీరిద్దరి కాంబినేషన్ లో సీన్లు సినిమాకి హైలైట్ గా నిలుస్తాయని చెబుతున్నారు.

ఈ సినిమాలో సాయి ధరమ్ తేజ్ సరసన నివేదా పేతురాజ్ హీరోయిన్ గా కనిపించనుంది. భగవాన్, జె.పుల్లారావు నిర్మాతలుగా వ్యవహరిస్తున్న ఈ సినిమాను జూన్ 4న విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.

Most Recommended Video

30 రోజుల్లో ప్రేమించటం ఎలా? సినిమా రివ్యూ & రేటింగ్!
‘జబర్దస్త్’ కమెడియన్ల రియల్ భార్యల ఫోటోలు వైరల్..!
హీరో, హీరోయిన్ల పెయిర్ మాత్రమే కాదు విలన్ ల పెయిర్ లు కూడా ఆకట్టుకున్న సినిమాలు ఇవే..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus