ఒకప్పుడు సినిమా అంటే…రచయితలు…దర్శకులు తమ మైండ్ లో ఉన్న ఆలోచనలను పదును పెట్టి తెరపై ఆవిష్కరించే వారు. అలా కాల క్రమేణా…సమాజాన్ని శాసించే సినిమాలు సైతం వచ్చాయి. అయితే పోను…పోను సినిమా ఒక బిజినెస్ గా మారిపోవడంతో సినిమా అంటే వ్యాపారం…కేవలం డబ్బు మాత్రమే సంపాదించుకునే వ్యాపారంగా మారిపోయింది. అయితే అలాంటి సమయంలోకుడా మంచి సినిమా బ్రతకాలి…మంచి కధ తెరకెక్కించాలి అని కొంతమంది నిర్మాతలకు మాత్రమే ఉంటుంది…అలాంటి వారిలో మన నిర్మాత “సాయి కొర్రపాటి” ఒకరు.తొలి ప్రయత్నంలోనే ‘ఈగ’ లాంటి సాహసోపేత చిత్రాన్ని తీసిన నిర్మాత ఆయన. ఆ సినిమా రాజమౌళి మీద నమ్మకంతో చేసి ఉండొచ్చు కానీ…ఆ తరువాత సినిమాలు మాత్రం ఆయన కధను నమ్మే తీశారు అని చెప్పక తప్పదు.
అందాల రాక్షసి.. దిక్కులు చూడకు రామయ్యా.. ఊహలు గుసగుసలాడే లాంటి సినిమాలు ఆయన అభిరుచిని మనకు అర్ధం చూపిస్తాయి. సినిమా ఫలితాలు ఎలా ఉన్నా…ఆ సినిమాల కధ…ఆ కధను నమ్మి ఒక నిర్మాత డబ్బులు పెట్టి మరీ సినిమాను నిర్మించడం అంటే చాలా గొప్ప విషయం అనే చెప్పాలి. అయితే గెలుపు ఓటములతో సంభంధం లేకుండా, లాభ నష్టాలను బేరీజు వేసుకోకుండా ఇలా మంచి సినిమాలను అందిస్తున్న సాయి లాంటి నిర్మాతలకు మంచి రోజులు వచ్చాయి అని అనుకుందాం….ఇంకా రావాలని..మరిన్ని మంచి సినిమాలు తీయాలని ఆశిద్దాం.