సాయి కుమార్ ను ముప్పు తిప్పలు పెట్టిన సినిమా అదే..!

హీరో గా, విలన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఎన్నో విభిన్నమైన పాత్రలు చేసి ప్రేక్షకులను మెప్పించారు సాయి కుమార్. అంతేకాదు డబ్బింగ్ ఆర్టిస్ట్ గా కూడా ఈయన సుమన్, రాజశేఖర్ వంటి ఎంతో మంది హీరోలకు లైఫ్ ఇచ్చారని చెప్పడంలో కూడా అతిశయోక్తి కాదు. రజినీ కాంత్ కు సైతం ‘పెదరాయుడు’ ‘బాషా’ చిత్రాలలో డబ్బింగ్ చెప్పింది సాయి కుమారే అన్న సంగతి అందరికీ తెలిసిందే. ఇక హీరోగా ఈయన నటించిన ‘పోలీస్ స్టోరీ’ చిత్రం అప్పట్లో ఓ ట్రెండ్ సెట్టర్.

ఆ చిత్రం సాయి కుమార్ ఇమేజ్ ను డబుల్ చేసిందనే చెప్పాలి. అయితే ఆ తరువాత వరుసగా ఆయన అలాంటి పోలీస్ క్యారెక్టర్ ఉన్న సినిమాలు.. అలాగే యాక్షన్ సినిమాలు ఎన్నో చేశాడు. ఆ కోవలో వచ్చిందే ‘ఈశ్వర్ అల్లా’ చిత్రం. ఆరోజుల్లోనే ఈ చిత్రాన్ని 2 కోట్ల భారీ బడ్జెట్ తో రూపొందించారట. ఈ చిత్రాన్ని సాయి కుమార్ తమ్ముడు అయ్యప్ప శర్మనే డైరెక్ట్ చేశాడట. అంతేకాదు ఈ చిత్రంలో విలన్ గా సాయి కుమార్ తండ్రి పి.జె. శర్మ నటించారట.

దాంతో ఈ సినిమా హిట్ అవ్వదు అని డిస్ట్రిబ్యూటర్లు సైడ్ అయిపోయారట. ఈ క్రమంలో దాసరి నారాయణ రావు గారు సాయం చెయ్యడంతో ‘ఈశ్వర్ అల్లా’ ను రిలీజ్ చేశారట. అయితే డిస్ట్రిబ్యూటర్లు చెప్పినట్టే ఈ సినిమా అట్టర్ ఫ్లాప్ అయ్యింది. పెట్టిన రెండు కోట్ల బడ్జెట్ లో పదో శాతం కూడా ఈ చిత్రం కలెక్ట్ చెయ్యలేదట. ఫలితంగా ఆ అప్పు తీర్చడం కోసం సాయి కుమార్ 15 సినిమాలు చెయ్యాల్సి వచ్చిందట.

Most Recommended Video

పవర్ స్టార్ సినిమా రివ్యూ & రేటింగ్!
ఎస్.ఎస్.రాజమౌళి సినిమాల IMDB రేటింగ్స్!
తెలుగు సినిమాల్లో నటించిన 27 బాలీవుడ్ హీరోయిన్లు ఎవరో తెలుసా?

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus