Project K: ప్రాజెక్ట్ కే సినిమాకు ఆస్కార్.. సాయిమాధవ్ బుర్రా కామెంట్స్ వైరల్!

టాలీవుడ్ స్టార్ డైరెక్టర్లలో ఒకరైన నాగ్ అశ్విన్ డైరెక్షన్ లో తెరకెక్కే సినిమాలు ఇతర డైరెక్టర్ల సినిమాలకు భిన్నంగా ఉంటాయనే సంగతి తెలిసిందే. ప్రభాస్ నాగ్ అశ్విన్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ప్రాజెక్ట్ కే సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా థియేటర్లలో రిలీజ్ కానుంది. భారీ క్యాస్టింగ్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాకు రికార్డ్ స్థాయిలో బిజినెస్ జరుగుతోంది. దర్శకుడు నాగ్ అశ్విన్ ప్రేక్షకులను మరో కొత్త ప్రపంచంలోకి తీసుకెళతారని కామెంట్లు వినిపిస్తున్నాయి.

సాయిమాధవ్ బుర్రా ఈ సినిమా గురించి తాజాగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ చెప్పిన విషయాలు పభాస్ అభిమానులకు గూస్ బంప్స్ తెప్పిస్తున్నాయి. సాయిమాధవ్ బుర్రా ఈ సినిమా కోసం పని చేస్తున్నారు. ప్రాజెక్ట్ కే సినిమా చూసిన తర్వాత అసలు ఇలాంటి ఆలోచన దర్శకునికి ఏ విధంగా వచ్చిందని ఆశ్చర్యపోతారని ఆయన తెలిపారు. ఈ సినిమా కథ విన్న సమయంలో చాలాసేపు నేను షాక్ లో ఉండిపోయానని ఆయన చెప్పుకొచ్చారు.

ఇలా ఆలోచించొచ్చా? ఇలా కూడా కథలు తయారు చేయవచ్చా? అని అనిపించిందని సాయిమాధవ్ బుర్రా కామెంట్లు చేశారు. ఈ సినిమా చూసే ప్రేక్షకులను దర్శకుడు కొత్త లోకానికి తీసుకెళతారని ఆయన చెప్పుకొచ్చారు. నాగ్ అశ్విన్ అద్భుతమైన ఆలోచన ఉన్న డైరెక్టర్ అని ఆయనను ప్రేక్షకులు వేరే లెవెల్ లో చూడబోతున్నారని సాయిమాధవ్ బుర్రా వెల్లడించారు. దీపికా పదుకొనే. అమితాబ్ బచ్చన్ ఈ సినిమాలో కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

ప్రాజెక్ట్ కే (Project K) సినిమాకు ఆస్కార్ రావచ్చు అని ఈ సినిమా విడుదలైన తర్వాత ప్రపంచం మొత్తం ఆయన గురించి మాట్లాడటం జరుగుతుందని సాయిమాధవ్ బుర్రా పేర్కొన్నారు. తన కామెంట్లతో సాయిమాధవ్ బుర్రా సినిమాపై అంచనాలను పెంచేశారు. సాయిమాధవ్ బుర్రా స్టార్ రైటర్ గా కెరీర్ ను కొనసాగిస్తుండగా ఈ రైటర్ రెమ్యునరేషన్ కూడా భారీ రేంజ్ లో ఉందని తెలుస్తోంది.

ఏజెంట్ సినిమా రివ్యూ & రేటింగ్!
పొన్నియన్ సెల్వన్సినిమా రివ్యూ & రేటింగ్!

బట్టలు లేకుండా నటించిన వారిలో ఆ హీరోయిన్ కూడా ఉందా?
పెళ్లికి ముందు గర్భవతి అయిన హీరోయిన్స్.. ఈ లిస్ట్ లో ఆ హీరోయిన్ కూడా ఉందా

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus