వైరల్‌ అవుతోన్న సూపర్‌స్టార్‌పై ‘ఫిదా’ భామ కామెంట్లు!

‘మీ అభిమాన నటుడు ఎవరు?’ అని హీరోలను అడిగితే అందులో చెప్పే పేర్లలో చిరంజీవి కచ్చితంగా ఉంటుంది. అదే హీరోయిన్లను అడిగితే చెప్పే పేర్లలో మహేష్‌బాబు పేరు కచ్చితంగా ఉంటుంది. సాయిపల్లవిని అడిగితే ఇలానే చెప్పింది. అయితే ఆమె ఆ తర్వాత చేసిన కామెంట్స్‌ ఇప్పుడు వైరల్‌ అవుతున్నాయి. మహేష్‌ స్కిన్‌టోన్‌ గురించి ఆమె చెప్పిన విషయాలు మహేష్‌ అభిమానుల్ని ఆనందంలోపడేస్తే, సాయి పల్లవి అభిమానులు చర్చించుకునేలా చేశాయి. సాయి పల్లవి తాజాగా నటించిన ఆంథాలజి ‘పావ కాథైగల్’ డిసెంబర్ 18న నెట్ ఫ్లిక్స్ లో విడుదల కాబోతోంది. ఈ సందర్భంగా ఆమె చేసిన కామెంట్సే ఆ వైరల్‌ న్యూస్‌.

ఫిదాతో ఓవర్‌నైట్‌ స్టార్‌ అయిపోయింది సాయిపల్లవి. కుర్రకారులో తిరుగులేని ఫాలోయింగ్ సంపాదించేసుకుంది. ప్రస్తుతం ‘లవ్‌స్టోరీ’, ‘విరాటపర్వం’, ‘శ్యామ్‌ సింగరాయ్‌’ సినిమాల్లో నటిస్తోంది. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో టాలీవుడ్‌ హీరోల గురించి ఒక్క పదంలో చెప్పమని అడిగారు. అల్లు అర్జున్ గురించి అడిగితే ‘సూపర్బ్ డ్యాన్సర్’ అని చెప్పింది. బన్నీ డ్యాన్స్‌ అంటే తనకు చాలా ఇష్టమని చెప్పింది. స్వతహాగా డ్యాన్సర్‌ కదా అందుకే అంత నచ్చి ఉంటాడు అని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

సాయిపల్లవిని మహేష్ బాబు గురించి అడిగినప్పుడు చెప్పిన సమాధానమే ఇప్పుడు వైరల్‌. మహేష్‌బాబు అందంగా ఉంటాడు అని చెబుతూనే స్కిన్‌టోన్‌ గురించి చెప్పుకొచ్చింది. ఇంతకీ సాయి పల్లవి ఏమందంటే… “మహేష్ బాబు అందంగా ఉంటారు. స్కిన్ టోన్‌ కూడా చక్కగా ఉంటుంది. ఎప్పుడూ మెరిసిపోతూ ఉంటారు. అతనని చూసినప్పుడల్లా మాములు మనుషులకు అంతలా మెరిసే స్కిన్ ఉంటుందా అని ఆశ్చర్యపోతుంటా’’ అని చెప్పంది సాయిపల్లవి. అంతేకాదు మహేష్‌ ఫొటోలు కనిపిస్తే జూమ్‌ చేసి మరీ స్కిన్‌ టోన్‌ చెక్‌ చేస్తుంటా’ అని కూడా చెప్పింది.

Most Recommended Video

2020 Rewind: ఈ ఏడాది డిజాస్టర్ సినిమాలు ఇవే..!
ఈ 10 మంది సినీ సెలబ్రిటీలు పెళ్లి కాకుండానే పేరెంట్స్ అయ్యారు..!
లాక్ డౌన్ టైములో పెళ్లిళ్లు చేసుకున్న టాలీవుడ్ సెలబ్రిటీస్..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus