Sai Pallavi: సాయిపల్లవి మొటిమలకు సర్జరీ చేయించుకున్నారా.. ఆమె ఏమన్నారంటే?

టాలీవుడ్ ఇండస్ట్రీలో న్యాచురల్ బ్యూటీగా మంచి గుర్తింపును సొంతం చేసుకున్న సాయిపల్లవి (Sai Pallavi) సినిమా సినిమాకు కెరీర్ పరంగా అంతకంతకూ ఎదుగుతున్న సంగతి తెలిసిందే. సాయిపల్లవి తండేల్ (Thandel) , బాలీవుడ్ రామాయణం ప్రాజెక్ట్ లతో పాటు పలు క్రేజీ ప్రాజెక్ట్ లతో బిజీ అవుతున్నారు. సాయిపల్లవి ఒకప్పుడు మొటిమలతో కనిపించగా ఇప్పుడు మొటిమలు లేకుండానే కనిపిస్తున్నారు. అయితే సాయిపల్లవి మొటిమల కోసం సర్జరీ చేయించుకున్నారని ఒక వార్త సోషల్ మీడియా వేదికగా తెగ వైరల్ అవుతోంది.

అదే సమయంలో సాయిపల్లవి రింగుల జుట్టు సీక్రెట్ ఏంటని చాలా సందర్భాల్లో ఆమె అభిమానులు సోషల్ మీడియా వేదికగా కామెంట్లు చేశారు. అయితే మొటిమలకు సర్జరీ గురించి, రింగుల జుట్టు గురించి సాయిపల్లవి స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మలయాళం ప్రేమమ్ సినిమా షూట్ సమయంలో నా ముఖంపై చాలా మొటిమలు ఉండేవని ప్రేమమ్ లో నాకు ఆఫర్ రావడానికి కూడా మొటిమలే కారణమని ఆమె తెలిపారు.

ప్రస్తుతం నా ముఖంపై ఎలాంటి మొటిమలు లేవని సాయిపల్లవి చెప్పుకొచ్చారు. మొటిమల కోసం నేను ఎలాంటి చికిత్స కానీ థెరపీ కానీ చేయించుకోలేదని ఆమె కామెంట్లు చేశారు. టీనేజ్ అమ్మాయిలకు మొటిమలు సాధారణంగా వస్తాయని సాయిపల్లవి అన్నారు. మొటిమలు పోవడానికి ఎలాంటి చికిత్స అవసరం లేదని ఆమె పేర్కొన్నారు. ఒత్తైన రింగుల జుట్టు గురించి సాయిపల్లవి స్పందిస్తూ తాను అలోవేరా జెల్స్ ను ఉపయోగిస్తానని తెలిపారు.

తాను ఆర్గానిక్ ఆహార పదార్థాలను మాత్రమే తీసుకుంటానని ఆమె పేర్కొన్నారు. సాయిపల్లవి చెప్పిన తన బ్యూటీ సీక్రెట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. సాయిపల్లవి సక్సెస్ రేట్ మరింత పెరగాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. సాయిపల్లవికి తర్వాత ప్రాజెక్ట్ లతో భారీ హిట్లు దక్కాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు. రామాయణంలో సీత రోల్ వల్ల సాయిపల్లవి నటిగా ఎన్నో మెట్లు పైకి ఎక్కుతారని ఫ్యాన్స్ అంచనా వేస్తున్నారు.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus